సైబర్‌ నేరాలకు బ్యాంకింగ్‌ వ్యవస్థలో లోపాలే కారణం.. ఆర్బీఐ గవర్నర్‌కు సీపీ సజ్జనార్ లేఖ

Wait 5 sec.

మోపుతున్న సంగతి తెలిసిందే. భారీ ఆపరేషన్లతో సైబర్ నెట్‌వర్క్‌లను బయటికి లాగుతున్నారు. ఇటీవలె నెట్‌వర్క్‌ను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దాదాపు రూ.300 కోట్ల మోసాలను బట్టబయలు చేశారు. అయితే తేలింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లకు.. పలువురు బ్యాంక్ అధికారులే సాయం చేస్తున్నట్లు గుర్తించి.. వారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు.. మంగళవారం ఒక కీలక లేఖ రాశారు. దేశంలో పెరుగుతున్న సైబర్‌ మోసాలకు కారణం.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న లోపాలేనని ఆ లేఖలో సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే.. బ్యాంకింగ్ సిస్టమ్‌లో సమూల మార్పులు తీసుకురావాలని ఆర్బీఐ గవర్నర్‌‌కు విజ్ఞప్తి చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న లోపాలు, లొసుగులే ఇప్పుడు అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్‌ నేరస్థులకు వరంగా మారాయని సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి ఆపరేషన్లలో మ్యూల్‌ ఖాతాలు, వాటిని సమకూర్చేందుకు నేరగాళ్లకు సహకరిస్తున్న పదుల సంఖ్యలో బ్యాంక్ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వాటిలో ఉన్న లొసుగులను గుర్తించారు. మ్యూల్‌ అకౌంట్లను ఓపెన్ చేసేందుకు కేవైసీ ధ్రువీకరణలో బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ఎత్తిచూపారు. ఇలాంటి లోపాలు జరిగినపుడు.. సంబంధిత బ్రాంచ్ అధికారులను బాధ్యులను చేసేలా వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జనార్ విన్నవించారు. అధిక శాతం అక్రమ ఖాతాలు ప్రైవేటు బ్యాంకుల్లోనే ఉన్నాయని తెలిపారు. కొన్ని బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన వారితోపాటు ఛార్జిషీట్‌ నమోదైన బ్యాంకు అధికారులను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఈ మ్యూల్‌ అకౌంట్లను సమీక్షించేందుకు ఆర్బీఐ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, నగర పోలీసులతో జాయింట్‌ వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఏవైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు జరిగితే వాటిని క్షణాల్లో గుర్తించే టెక్నాలజీ సిస్టమ్‌లను తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆర్బీఐ గవర్నర్‌కు రాసిన లేఖలో సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.