ఏపీఎస్‌ఆర్టీసీ ఐడియా అదిరింది.. పాత బస్సును భలే మార్చేశారు, కొత్త లుక్‌తో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుగా

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర విద్యుత్‌ వాహన పాలసీ 4.O (Sustainable Electric Vehicle Policy) కింద ఆర్టీసీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో డీజిల్ ఖర్చు తగ్గించి కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్ బస్సుల్ని తీసుకొస్తోంది. కేంద్రం నుంచి 1050 బస్సులు కేటాయించగా.. . అంతేకాదు కాలం చెల్లిన పాత బస్సుల్ని రీమోడల్ చేసి విద్యుత్ బస్సులుగా మార్చేస్తోంది. పాత డీజిల్ బస్సును విద్యుత్ బస్సుగా మార్చేశారు. ఈ మేరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్టీసీలో పాత బస్సులు కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటాయి.. ఈ కాలం చెల్లిన బస్సును ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ కింద రెట్రోఫిట్‌మెంట్‌ చేసి, విద్యుత్‌తో నడిచే ఏసీ బస్సుగా మార్చేశారు. పాత సూపర్‌ లగ్జరీ బస్సును కళ్యాణీ ట్రాన్స్‌ సంస్థ (భారత్‌ ఫోర్ట్జ్‌) ప్రయోగాత్మకంగా విద్యుత్‌ ఏసీ బస్సు (ఇంద్ర సర్వీస్‌)గా మార్చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సును విజయవాడ ఆర్టీసీ హౌస్‌కు తీసుకురాగా అధికారులు పరిశీలించారు. ఈ బస్సును కొంతకాలం ట్రయల్ రన్ కోసం ఏదైనా రూట్‌లో నడపాలని నిర్ణయించారు. ఈ బస్సుకు ఎంతసేపు ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ వస్తుందో పరిశీలించనున్నారు. పాత బస్సుల్ని ఇదే తరహాలో రెట్రోఫిట్‌మెంట్‌ చేస్తే ఎంత ఖర్చవుతుంది?.. కొత్త విద్యుత్‌ ఏసీ బస్సులు తీసుకోవడం కంటే.. ఇలా పాత వాటిని మార్పు చేస్తే ఎంత ఖర్చువుతుంది? వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే చిత్తూరు ఆర్టీసీ డిపోలో .. ఇప్పటికే ఈ బస్సు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు పాత బస్సుల్ని విద్యుత్ బస్సులుగా మార్చేస్తున్నారు. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీకి ఎలాంటి డీజిల్‌ కొరత లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 వేల బస్సులకు రోజుకు 7.5 లక్షల లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది.. అయితే ప్రస్తుతం అన్ని బస్సు సర్వీసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డీజిల్ విషయంలో ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని అధికారులు తెలిపారు.