టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లో స్వింగ్ వేడి ఇంకా తగ్గలేదు. . గాల్లోనే స్వింగ్ అవుతూ వచ్చిన భువీ బంతికి ఢిల్లీ ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వరల్డ్ బెస్ట్ స్వింగ్ బౌలర్ అంటే ఏంటో కు మరోసారి రుచి చూయించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసిన .. ఆ స్కోర్‌ను కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తన స్వింగ్ యార్కర్లతో మరోసారి కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ తీసిన భువీ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. యువ ఆటగాడు సాహిల్ పరాఖ్.. భువీ స్వింగ్‌కు భయపడ్డాడు. లెగ్ వికెట్ మీద పడిన యార్కర్ మిడ్ వికెట్లను తాకడంతో బెయిల్స్ ఎగిరిపోయాయి. భువీ వేసిన ఈ స్వింగ్ యార్కర్ అతని కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచింది. ఇక మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సాహిల్ పరాఖ్‌తో పాటు డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్‌ను అవుట్ చేశాడు. పవర్ ప్లే లోనే మూడు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్ కూడా పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎక్కువ వికెట్లు తీసిన హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఓవరాల్‌గా 14 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.