ఇండోనేషియాలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ.. ఏడుగురు మృతి, 81 మందికి గాయాలు

Wait 5 sec.

: ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక ప్యాసింజర్ రైలు, లాంగ్ డిస్టెన్స్ రైలు అత్యంత వేగంతో ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 81 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బోగీలు ఒకదానిలోకి ఒకటి దూసుకుపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం జరిగిందిలా..!జకార్తాకు సమీపంలోని బెకాసి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక లోకల్ రైలు ట్రాక్‌పై వస్తుడగా.. రైల్వే ట్రాక్‌పైకి ఒక్కసారిగా ఒక టాక్సీ దూసుకు వచ్చింది. అయితే ఆ టాక్సీని లోకల్ రైలు ఢీకొట్టి ఆగిన కొద్ది క్షణాల్లోనే.. వెనుక నుంచి వస్తున్న లాంగ్ డిస్టెన్స్ రైలు అత్యంత వేగంతో వచ్చి లోకల్ రైలును ఢీకొట్టింది. ఈ క్రమంలోనే లోకల్ రైలులోని మహిళల ప్రత్యేక బోగీలోకి లాంగ్ డిస్టెన్స్ రైలు చొచ్చుకు రావడంతో.. భారీ ప్రాణనష్టం సంభవించింది.శిథిలాల కిందే క్షతగాత్రులు..!ప్రమాదం జరిగిన వెంటనే ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఏజెన్సీ చీఫ్ మహమ్మద్ షఫీ విలేకరులతో మాట్లాడుతూ.. "విరిగిపోయిన బోగీల మధ్యలో చాలా మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీయడం ఒక సవాలుగా మారింది. ఇప్పటికీ కొందరు లోపల ప్రాణాలతోనే ఉన్నారు. కానీ లోహపు కడ్డీల మధ్య వారు ఇరుక్కుపోయారు" అని తెలిపారు. సహాయక సిబ్బంది 'యాంగిల్ గ్రైండర్స్' వంటి భారీ యంత్రాలను ఉపయోగించి బోగీల ఇనుప భాగాలను కట్ చేసి లోపల ఉన్న వారిని బయటకు తీస్తున్నారు. గాయపడిన 81 మందిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య కూడా విపరీతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రంగంలోకి దర్యాప్తు సంస్థలుస్టేట్ రైల్వే సంస్థ పీటీ కేఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబీ రషీదిన్ ఈ మరణాలను ధృవీకరించారు. కాగా ట్రాక్‌పైకి వచ్చిన టాక్సీ వియత్నాంకు చెందిన 'గ్రీన్ ఎస్ఎం ఇండియా'కి చెందిన ఎలక్ట్రిక్ టాక్సీగా గుర్తించారు. దీనిపై సదరు టాక్సీ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ (కేఎన్‌కేటీ) ఈ ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై విచారణ చేపట్టింది.