IPL 2026 సినారియో.. ఫ్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఏ జట్టు ఎన్ని గెలవాలో తెలుసా? సీఎస్కే, ముంబైకి ఎంత ఛాన్స్ ఉందంటే.. !

Wait 5 sec.

సగం సీజన్ దాదాపు ముగిసింది. అన్ని జట్లు తొలి ఏడు మ్యాచ్‌లు ముగించుకుని.. ప్లే ఆఫ్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది కమ్ బ్యాక్ ఇస్తాయి అనుకున్న మిగల్చగా.. అందరికీ షాక్ ఇచ్చి టాప్ 4లో నిలిచాయి. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కి చేరుకోవాలంటే ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించాలో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్ ప్రకారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టాప్ 4లో ఉన్నాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన జట్లకే ఆ అవకాశం ఉంటుంది. అయితే, ఇంకా సగం సీజన్ మిగిలుండటంతో దాదాపు అన్ని జట్లకూ అవకాశం ఉంటుంది. 16 పాయింట్లు వచ్చిన జట్టు ప్లే ఆఫ్ రేసులో సేఫ్‌గా ఉన్నట్టు లెక్క.పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించి 13 పాయింట్లతో ఉంది. ఇక మిగిలిన 7 మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిస్తే చాలు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఆర్సీబీ తన మిగిలిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిస్తే ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లినట్టే. రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 మ్యాచ్‌లలో 5 గెలిచి 10 పాయింట్లతో కొనసాగుతోంది. రాజస్థాన్ తన మిగతా ఆరు మ్యాచ్‌లలో కచ్చితంగా మూడు గెలవాల్సిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 8 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పది పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాంటే ఆరింటిలో ఇంకా మూడు గెలవాల్సిందే. 8 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ చివరి ఆరు మ్యాచ్‌లలో కచ్చితంగా నాలుగు గెలవాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఆరు పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవాల్సిందే. ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఢిల్లీ ఇప్పుడు డేంజర్‌లో పడింది. ఎనిమిది మ్యాచ్‌లలో మూడు మాత్రమే గెలిచిన ఢిల్లీ.. మిగిలిన ఆరింటిలో ఐదు గెలిచి తీరాల్సిందే. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు రెండ్రెండు విజయాలు సాధించాయి. కోల్‌కతా ఒక మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఐదు పాయింట్లతో కొనసాగుతోంది. ముంబై, లక్నో నాలుగు పాయింట్లతో ఉన్నాయి. కేకేఆర్ తన చివరి ఆరు మ్యాచ్‌లలో కచ్చితంగా ఆరూ గెలవాల్సిందే.. లక్నో కూడా ఆరుకి ఆరూ గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కి చేరుకోగలదు. వరల్డ్ టాప్ క్లాస్ ప్లేయర్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచిన ఎంఐ ప్లే ఆఫ్స్‌కి చేరుకోవాలంటే చివరి ఏడు మ్యాచ్‌లలో ఆరు గెలవాల్సిందే. ఇప్పుడున్న కాంపిటేషన్ ప్రకారం ఏడూ గెలిస్తే ప్లే ఆఫ్స్ సీటు కన్ఫార్మ్ చేసుకుంటుంది.