దిగ్గజ బ్యాంక్ నుంచి శుభవార్త.. 2 నెలల్లో ఖాతాల్లోకి బోనస్ షేర్లు.. ప్రతి 3 షేర్లకు 1 షేరు ఉచితం!

Wait 5 sec.

: మిడ్ క్యాప్ కేటగిరిలోని బ్యాంకింగ్ సెక్టార్ సంస్థ సిటీ యూనియన్ బ్యాంకు లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. తాజాగా జరిగిన బ్యాంకు బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో జారీ చేసేందుకు ఆమోదం లభించినట్లు తెలిపింది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం ప్రతి 3 షేర్లకు ఒక షేరు ఉచితంగా లభించనుంది. మరోవైపు ఈ బోనస్ ఇష్యూ ద్వారా లభించే అదనపు షేర్లను షేర్ హోల్డర్ల ఆమోదం తర్వాత రెండు నెలల్లోగా డీమ్యాట్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బోనస్ షేర్ల ఇష్యూ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సిటీ యూనియన్ బ్యాంకు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే జరిగిన బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 1:3 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 3 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ గల 1 ఈక్విటీ షేరుని ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేస్తారు. అంటే 3 షేర్లు ఉన్నట్లయితే అవి నాలుగు షేర్లు అవుతాయి. అయితే, ఈ బోనస్ షేర్లు అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని షేర్ హోల్డర్స్ ఆమోదం పొందిన తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ బోనస్ షేర్స్ షేర్ హోల్డర్స్ ఆమోదం పొందిన తర్వాత 2 నెలల్లో క్రెడిట్ చేస్తామని వెల్లడించింది. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో సిటీ యూనియన్ బ్యాంకు లిమిటెడ్ షేరు 3.8 శాతం లాభంతో రూ. 272.50 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో ఈ షేరు 2 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 14 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో 14 శాతం పెరిగింది. గత ఏడాదిలో 53 శాతం పెరిగింది. గత ఐదేళ్ల కాలంలో 63 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు మార్కెట్ విలువ రూ. 20,170 కోట్ల వద్ద ఉంది.సిటీ యూనియన్ బ్యాంకుని గతంలో కుంభకోణం బ్యాంకు లిమిటెడ్ అని పిలిచేవారు. ప్రస్తుతం తమ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలతో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్ అందిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంకుని అక్టోబర్ 31, 1904లో ప్రారంభించారు. అత్యంత పురాతన బ్యాంకుల్లో ఒకటిగా ఈ బ్యాంక్ నిలిచింది.