పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Wait 5 sec.

: భారతీయులకు బంగారం అంటే ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. బంగారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. బంగారాన్ని కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి సాధనంగా చూస్తున్నారు. దీంతో ఇటు వైపు పెట్టుబడులు పెరుగుతుండగా.. ధరలు కూడా అదే విధంగా ఎగబాకుతున్నాయి. గతేడాది చూస్తే పసిడి ధర రికార్డు స్థాయిలో 70 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది కూడా అదే తంతు కొనసాగుతుంది.2 026లోనూ తొలి రెండు నెలల్లో పసిడి ధర భారీగానే పెరిగినప్పటికీ.. తర్వాత పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అంతా మార్చేసింది. యుద్ధం ధాటికి క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు అటు వైపు మొగ్గుచూపారు. దీనికి తోడు యూఎస్ డాలర్ కూడా పుంజుకోవడంతో బంగారం ధరలు.. మార్చి నెలలో భారీగా క్రాష్ అయ్యాయి. ఒకదశలో గరిష్టాల నుంచి.. రూ. 30 వేలకుపైగా దిగొచ్చింది. తర్వాత యుద్ధం ముగింపు కోసం చర్చలు, కాల్పుల విరమణ వంటివి.. మళ్లీ పెరిగేలా చేశాయి.పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర... రెండో దశ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో బ్రెంట్ ముడి చమురు ధరలు ఏప్రిల్ 28న పెరిగి బ్యారెల్ కు 110 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో మళ్లీ గోల్డ్ రేట్లు దిగిస్తున్నాయి.ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం 4670 డాలర్లకు తగ్గింది. కిందటి రోజు ఇది ఒక దశలో 4720 డాలర్ల స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా 76 డాలర్ల నుంచి 74 డాలర్లకు పడిపోయింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 94.20 వద్ద ఉంది.తగ్గిన బంగారం, వెండి ధరలు..దేశీయంగా బంగారం ధరలు కూడా పతనం అయ్యాయి. ప్రస్తుతం ఏప్రిల్ 28న ఉదయం 9.30 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ పసిడి ధర రూ. 650 తగ్గి తులం రూ. 1,40,250 కి చేరింది. కిందటి రోజు రూ. 300 తగ్గింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఇవ్వాళ రూ. 710 తగ్గి 10 గ్రాములకు రూ. 1.53 లక్షలుగా ఉంది. వెండి ధర విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో రూ. 5 వేలు తగ్గి ప్రస్తుతం కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ఉంది.