టాటా కంపెనీ చరిత్రలోనే తొలిసారి ఇలా.. 5 లక్షల మందికి బెనిఫిట్.. బోనస్ + 600 శాతం డివిడెండ్, రికార్డ్ తేదీ ప్రకటన

Wait 5 sec.

Tata Group: దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన ట్రెంట్ తమ షేర్ హోల్డర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిటైల్ అవుట్ లెట్స్ నిర్వహించే ఈ సంస్థ బోనస్ షేర్లతో పాటు డివిడెండ్ సైతం చెల్లిస్తామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ4 ఫలితాల్లో భారీ లాభాలు అందుకున్న క్రమంలో తమ కంపెనీ చరిత్రలోనే తొలిసారి బోనస్ ఇష్యూను ప్రకటించింది. దీంతో ఒకేసారి డబుల్ బొనాంజా అందనుంది. తాజాగా ఈ బోనస్ ఇష్యూ, డివిడెండ్ సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. దీంతో మళ్లీ ఫోకస్ లోకి వచ్చాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. రికార్డ్ తేదీ ప్రకటనఇటీవలి కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:2 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. అంటే రికార్డు తేదీ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసి డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరుని బోనస్ గా ఇస్తారు. ఈ బోనస్ షేర్లు అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డ్ తేదీని తాజాగా కంపెనీ ప్రకటించింది. మే 29, 2026ను బోనస్ ఇష్యూ రికార్డ్ తేదీగా వెల్లడించింది. ఆలోపు షేర్లు కొన్నవారికే బోనస్ షేర్లు అందుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ బోనస్ షేర్ల అలాట్మెంట్ అనేది జూన్ 21 లోపు పూర్తి చేస్తామని తెలిపింది. డివిడెండ్ రికార్డ్ తేదీతాజాగా ఈ డివిడెండ్ అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డ్ తేదీని నిర్ణయించింది. జూన్ 10, 2026గా రికార్డ్ తేదీ పేర్కొంది. అంటే ఆలోపు ఈ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసి కొనసాగిన వారికి డివిడెండ్ డబ్బులు అందుకునేందుకు అర్హత లభిస్తుంది. కంపెనీ యాన్యువల్ జనరల్ బాడీ సమావేశంలో షేర్ హోల్డర్ల ఆమోదం మేరకు ఈ డివిడెండ్ చెల్లింపులుఉంటాయని తెలిపింది.5 లక్షల మందికి బెనిఫిట్ప్రస్తుతం ఈ కంపెనీకి 5 లక్షల మంది వరకు షేర్ హోల్డర్లు ఉన్నారు. అంటే వారందరికీ ఈ బోనస్ ఇష్యూ, డివిడెండ్ ద్వారా ఒకేసారి డబుల్ ప్రయోజనం కలగనుంది. 100 షేర్లు ఉన్న వారికి మరో 50 షేర్లు ఉచితంగా అంటే 150 షేర్లుగా మారనున్నాయి. అలాగే వాటిపై ఒక్కో షేరుకు అదనంగా రూ.6 చొప్పున డివిడెండ్ డబ్బులు రానున్నాయి.