శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై రంగంలోకి దిగింది. ఈ విషయంలో మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ విచారణను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సోమవారం తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. భూదేవి కాంప్లెక్స్ వద్దకు వెళ్లనున్నారు. అక్కడ పాత ఎస్వీబీసీ ఆఫీసును తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించనున్నారు. మరోవైపు అంశంపై విచారణ జరిపి.. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని దినేష్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలనా వైఫల్యాలపై ఏకసభ్య కమిషన్ విచారణ జరపనుంది. 2021- 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిపై ఏకసభ్య కమిషన్ విచారణ జరపనుంది. నెయ్యి సరఫరాలో టెండర్ నిబంధనల సడలింపు కారణాలపైనా విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు సిట్ నివేదిక అంశాలను సైతం ఏకసభ్య కమిషన్ పరిగణనలోకి తీసుకోనుంది. మొత్తం అన్ని అంశాలపైనా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. మరోవైపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. దానికి అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయడం ఎంతమేరకు సబబు అంటూ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌లో ప్రశ్నించారు. అయితే ఇటీవల కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్.. ఓవర్‌ లాపింగ్‌ కిందకు రాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపింది.ఈ నేపథ్యంలోనే ఈ అంశంలో వాస్తవాలను వెలికి తీసేందుకు ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది.