పీఎఫ్ వడ్డీ ప్రకటించిన EPFO.. 3 ఏళ్లుగా ఇలా.. ఈసారి ఈపీఎఫ్ వడ్డీ ఎంతంటే

Wait 5 sec.

EPF Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ()పై ఇచ్చే వడ్డీని ఉద్యోగులు భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025- 26కి సంబంధించిన వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో సోమవారం జరిగిన 239వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగానే అందించారు. '2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్‌కు చెల్లించే డబ్బులకు 8.25 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని సోమవారం జరిగిన సమావేశంలో సీబీటీ నిర్ణయం తీసుకుంది.' అని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. వడ్డీ రేటుకు సంబంధించి సీబీటీ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించనున్నారు. ప్రభుత్వం అధికారికంగా వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత ఈపీఎఫ్ చందాదారు అకౌంట్లకు వడ్డీ మొత్తం జమ చేస్తారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో 7 కోట్ల మందికిపైగా చందాదారులు ఉన్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.15 శాతంగా నిర్ణయించారు. ఆ తర్వాత 2023- 24 ఆర్థిక సంవత్సరంలో 8.25 శాతానికి పెంచారు. అప్పటి నుంచి ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ 8.25 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఇట్రస్టీల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో రూ. 1000 కంటే తక్కువ మొత్తాలు ఉన్న 1.33 లక్షల అకౌంట్లను గుర్తించారు. అందులో ఉన్న రూ. 5.68 కోట్లను సెటిల్ చేయనున్నారు. ఆ తర్వాత రూ. 1000 పైన బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను గుర్తించి వారి వారి బ్యాంకు ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేయనున్నారు. కేంద్ర కేబినెట్ సైతం ఇటీవలే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిష్క్రియంగా ఉన్న పీఎఫ్ ఖాతాల్లో సొమ్ము పేరుకుపోతున్న క్రమంలో ఆయా డబ్బులను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.