పశ్చిమాసియా యుద్ధం: ఇంధన సరఫరాపై భారత్‌‌కు రష్యా భరోసా.. కీలక ప్రకటన

Wait 5 sec.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా మంగళవారం సంకేతాలు ఇచ్చింది. ‘‘గల్ఫ్ సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాకు అవాంతరం ఏర్పడితే భారత్‌కు సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది’ అని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరుతో పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు, వాణిజ్యం, నౌకల రవాణా, ఇంధన మార్కెట్లపై ప్రభావాన్ని భారత్ నిశితంగా గమనిస్తోన్న వేళ రష్యా నుంచి ఈ సంకేతాలు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడినా కొద్ది రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదని, భారత్ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. 25 రోజులకు సరిపడా క్రూడాయిల్, 25 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉందని, ఇవి దాదాపు 8 వారాల పాటు సరిపోతాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇక, భారత ఇంధన సంస్థలు ప్రస్తుత ఒప్పందాల ప్రకారం రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. ఇది అదనపు నిల్వలను అందిస్తుంది. ప్రాంతీయ ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా నిల్వలను పెంచుకుంటూ వస్తోంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తగినంత ఇంధన నిల్వలను నిర్వహిస్తాయి. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు సరఫరాలో ఏర్పడే అవాంతరాలను అధిగమించి అదనపు పరిపుష్టిగా పనిచేస్తాయి. దేశవ్యాప్తంగా సరఫరా పరిస్థితి, ఫ్యూయల్ స్టాక్‌‌ను పరిశీలనకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కేంద్ర పెట్రోలియం సహజవనరుల శాఖ ఏర్పాటుచేసింది. భారత్ ప్రధాన ప్రాధాన్యతలు నిరంతరాయ ఇంధన లభ్యత, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న దాదాపు కోటి మంది భారతీయ పౌరుల శ్రేయస్సు అని ప్రభుత్వ వర్గాలు నొక్కిచెప్పాయి.మరోవైపు, యుద్ధం పరిణామాల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ఇప్పటికే మొదలైంది. క్రూడాయిల్ ధరలు మేర పెరిగి బ్యారెల్ 85 డాలర్లకు చేరుకోగా.. ఐరోపాలో సహజ వాయువు ధరలు దాదాపు 50 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ ఆరాంకో చెందిన అతిపెద్ద చమురుశుద్ధి ప్లాంట్ రాస్ తనూరా‌, ఖతార్‌లో గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ దాడితో తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా స్తంభించి ఇంధన సరఫరా కుప్పకూలే ప్రమాదం ఉంది. హర్మూజ్‌ మీదుగా వచ్చే నౌకల రవాణా, బీమా ఛార్జీలు పెరుగుదలతో అదనపు ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం చూపనున్నాయి.