ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని చెబుతుంటారు.. సరిగ్గా అలాగే ఒక పుస్తకం ఆయన బరువునే మార్చేసింది. అవును ఓ మంచి పుస్తకం ఆయన జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. డాక్టర్ , విజయవాడ ప్రజా వైద్యశాలలో మానసిక వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన చిన్నతనం నుంచి ఊబకాయం సమస్యతో బాధపడ్డారు. 2020లో ఆయన 145 కిలోల బరువు ఉన్నారు.. అధిక బరువుతో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఇబ్బందిపడేవారు. ఆయన ఎలాగైనా బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదే సమయంలో ఆయనకు ఒక బుక్ దొరికింది.. ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.డాక్టర్ నవీన్ సూరపనేనికి డాక్టర్‌ జేసన్‌ ఫంగ్‌ రచించిన ఒబెసిటీ కోడ్‌ బుక్ చదవడం మొదలుపెట్టారు. ఆ బుక్‌లో ఉన్న ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ విధానం బాగా నచ్చింది. వెంటనే ఆయన రోజువారీ ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ విధానాన్ని ఫాలో అయ్యారు. నవీన్ సూరపనేని ఈ ఫాస్టింగ్‌లో భాగంగా.. ఉదయం దాదాపు గంటన్నర పాటూ స్విమ్మింగ్ (ఈత) చేసేవారు. అనంతరం అరగంట పాటూ వ్యాయామం, ఓ గంట పాటూ టేబుల్ టెన్నిస్ ఆడేవారు. నవీన్ ఒకపూట మాత్రమే భోజనం చేశారు.. ఆయన ఒకపూట తినే ఆ ఫుడ్‌లో కార్బోహైడ్రేడ్‌లు లేకుండా డైట్ ప్లాన్ చేశారు. ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తే ప్రారంభంలో కచ్చితంగా ఆకలి వేస్తుంది. అలా ఆకలిగా అనిపిస్తే గ్రీన్ టీ తాగేవారు. ఆయన 2020లో 145 కేజీలు ఉంటే.. 2023 నాటికి 75 కేజీలకు తగ్గారు. ప్రతిరోజూ ఒక క్రమశిక్షణగా డైట్ ఫాలో అయ్యారు. ఇలా ఆయన 70 కేజీల బరువు తగ్గారు.. 145 నుంచి 75 కేజీలకు తగ్గారు. అంతేకాదండోయ్ ఆయన టేబుల్ టెన్నిస్‌లో కూడా రాణిస్తున్నారు.. అబుధాబిలో నిర్వహించిన ఓపెన్‌ మాస్టర్‌ గేమ్స్‌-2026లో టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్(55 కేటగిరీ)లో ఆయన కాంస్య పతకాన్ని అందుకున్నారు. నవీన్ సూరపనేని ప్రస్తుతం 85 కేజీలు ఉన్నారు.. ఒకవేళ తనకు ఇంకా బరువు తగ్గాలి అనిపిస్తే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తాను అంటున్నారు నవీన్ సూరపనేని. ఆయన వెయిట్ లాస్ జర్నీ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.