: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. సాధారణంగా పెట్టుబడుల విషయంలో రాబడిని పోల్చుకునేందుకు ఏదైనా పెద్ద పండగ నుంచి అదే పండగకు మధ్య వ్యవధిని చూస్తుంటారు. ఉగాది నుంచి ఉగాదికి.. దీపావళి నుంచి దీపావళికి ఇలానే హోలీ నుంచి హోలీకి కూడా లెక్కిస్తుంటారు. ఈ క్రమంలోనే గత హోలీ (2025 హోలీ) నుంచి ఈ ఏడాది హోలీ వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో బెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. 2025లో మార్చి 14న హోలీ జరగ్గా.. అప్పటి నుంచి ఈ ఏడాది హోలీ వరకు చూస్తే 11 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 50 శాతానికి మించి రిటర్న్స్ ఇచ్చినట్లు ఈటీమ్యూచువల్ ఫండ్స్ అనలిసిస్ వెల్లడించింది. ఈ సమయంలో మొత్తం 551 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా.. 531 స్కీమ్స్ పాజిటివ్ రిటర్న్స్ అందించాయి. 20 ఫండ్స్ నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. >> వీటిల్లో రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గతేడాది హోలీ నుంచి రికార్డు స్థాయిలో 100 శాతానికిపైగా రాబడి కూడా అందించాయి. నిప్పన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ టాప్ స్కీమ్‌గా నిలిచింది. ఇది అత్యధికంగా 112.79 శాతం రాబడి అందించగా.. లక్ష పెట్టుబడిని రూ. 2.13 లక్షలు చేసింది. తర్వాత డీఎస్పీ వరల్డ్ మైనింగ్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ 111.56 శాతం చొప్పున రిటర్న్స్ ఇవ్వగా.. ఇక్కడ కూడా లక్షను రూ. 2.12 లక్షలు చేసింది. ఈ క్రమంలో రెట్టింపునకు మించి లాభం వచ్చింది. మిగతా వాటిల్లో ఐసీఐసీఐ స్ట్రాటజిక్ మెటల్ అండ్ ఎనర్జీ ఈక్విటీ ఎఫ్ఓఎఫ్ లాస్ట్ హోలీ నుంచి 86.07 శాతం రాబడి అందించింది. హెచ్‌ఎస్‌బీసీ బ్రెజిల్ ఫండ్ 66.85 శాతం రిటర్న్స్ ఇచ్చింది. డీఎస్‌పీ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ 63.15 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఎడెల్‌వీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ అపార్చునిటీస్ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్, హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ వరుసగా 59.50 శాతం, 58.40 శాతం చొప్పున రాబడి అందించాయి. కోటక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ 56.18 శాతం, మిరే అసెట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ అండ్ అటానమస్ వెహికిల్స్ ఈక్విటీ పాసివ్ ఎఫ్ఓఎఫ్ 55.44 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చాయి. HSBC ఆసియా పసిఫిక్ డీవైఎఫ్, మిరే అసెట్ ఎస్ అండ్ పీ 500 టాప్ 50 ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ స్కీమ్స్ కూడా వరుసగా 53.57 శాతం, 50.52 శాతం చొప్పున రాబడి అందించాయి. నెగెటివ్ పెర్ఫామర్స్ విషయానికి వస్తే ఈ సమయంలో క్వాంట్ టెక్ ఫండ్ అత్యధికంగా 17.19 శాతం నష్టపోయింది. టాటా డిజిటల్ ఇండియా ఫండ్, సామ్‌కో యాక్టివ్ మూమెంటమ్ ఫండ్ వరుసగా 9.59 శాతం, 9.06 శాతం చొప్పున నష్టపోయాయి. తర్వాత సామ్‌కో మల్టీ క్యాప్ ఫండ్, క్వాంట్ కన్సంప్షన్ ఫండ్ వరుసగా 5.06 శాతం, 4.92 శాతం నష్టాల్ని మిగిల్చాయి. గమనిక: పైన ఇచ్చింది పెట్టుబడికి సిఫార్సు కాదు. కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. గతేడాది హోలీ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ప్రదర్శన ఎలా ఉందని మాత్రమే ఇచ్చాం. దీనిని ఆధారంగా చేసుకొని పెట్టుబడులు పెట్టొద్దు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందుకే వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.