Gold Price Crash: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య భీకర దాడులు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నింటిన సంగతి తెలిసిందే. కానీ, యుద్ధం ఇలాగే కొనసాగితో మరింత పెరగవచ్చనే అంచనాలూ ఉన్నాయి. అయితే, ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని, ఒక వేళ దౌత్యపరమైన చర్యలు సఫలమై పరిస్థితులు చక్కబడితే బంగారం, వెండి ధరలు 3 నుంచి 8 శాతం వరకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు మల్టీ వీక్ గరిష్ఠాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు గత సోమవారం రోజు 5400 డాలర్ల మార్క్ తాకింది. ఇక భారత్‌లో ఎంసీఎక్స్ బంగారం ధర రూ.1.70 లక్షల మార్క్ చేరువైంది. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గినట్లయితే బంగారం ధరలో 3-5 శాతం, వెండి ధరలో 5-8 శాతం వరకు పతనం కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతారని హెచ్చరిస్తున్నారు. బంగారంపై యుద్ధ ప్రభావంఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం, ప్రతిగా హార్ముజ్ జల సంధిని టెహ్రాన్ మూసివేయడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోలేక పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఫిబ్రవరిలో స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు, మార్చి నాటికి యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు కాస్త తగ్గి ప్రస్తుతం 5362 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకు ముందు రోజే ఈ ధర 5400 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే. స్పాట్ వెండి రేటు ఔన్సుకు 89.64 డాలర్ల వద్ద నాలుగు వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. భారత్‌లో 10 గ్రాముల బంగారం రేటు రూ.1.70 లక్షల మార్కు చేరువగా ఉండగా, వెండి కిలో రేటు రూ.3 లక్షల వైపు పరుగులు పెడుతోంది. , కానీ, దౌత్యపరమైన పురోగతి కనిపిస్తే మాత్రం 3-8 శాతం మేర ప్రాఫిట్ బుకింగ్ లేదా కరెక్షన్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్రిక్తతలు తగ్గితే బంగారంలో 3-5 శాతం, వెండిలో 5-8 శాతం వరకు ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, డీ-డాలరైజేషన్ వంటి కారణాల వల్ల దీర్ఘకాలికంగా బంగారం మార్కెట్ బలంగానే ఉంటుందని విశ్లేషించారు.