Locker Rent Increase: ప్రజలు తమ దగ్గరున్న విలువైన బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఇంట్లో భద్రంగా ఉండవు అనుకున్న వస్తువుల్ని.. ఎక్కువగా బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే బ్యాంకులు ఇందుకుగానూ లాకర్లపై అద్దె వసూలు చేస్తుంటాయి. వార్షిక ప్రాతిపదికన లాకర్ సైజును బట్టి ఛార్జీలు విధిస్తుంటాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి.. బ్రాంచ్‌ను బట్టి.. లొకేషన్‌ను బట్టి.. లాకర్ సైజును బట్టి వేర్వేరుగా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్ రెంటల్ స్ట్రక్చర్‌ను మార్చేసింది. ఇప్పుడు ఒక్కసారిగా ఛార్జీల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా మెట్రో ప్లస్ కేటగిరీని కూడా తీసుకురాగా కొత్త రూల్స్ 2026, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. >> లాకర్ సైజుల్లో ఎక్స్‌ట్రా స్మాల్, స్మాల్, మీడియం, ఎక్స్‌ట్రా మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ అని ఉండగా.. ఒక్కో దానికి లాకర్ రెంట్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇంకా లొకేషన్స్ క్లాసిఫికేషన్- మెట్రో ప్లస్, ప్లస్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌ను బట్టి కూడా వేర్వేరుగా ఉంటాయి. ఛార్జీలపై అదనంగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈటీ బ్యూరో రిపోర్ట్ ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన లాకర్ యాక్సెస్ రూల్స్‌ను కూడా కాస్త కఠినతరం చేసింది. బ్యాంకుల్లో కొంత కాలంగా దొంగతనం ఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. లాకర్ హోల్డర్స్ ఇకపై తమ లాకర్ యాక్సెస్ కోసం ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కొత్తగా తెచ్చిన మెట్రో ప్లస్ కేటగిరీలో ఏప్రిల్ 1 నుంచి లాకర్ రెంటల్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం. సైజ్ లాకర్ ఛార్జీ (రూపాయల్లో)ఎక్స్‌ట్రా స్మాల్ 4000స్మాల్7500మీడియం12500ఎక్స్‌ట్రా మీడియం15000లార్జ్20000ఎక్స్‌ట్రా లార్జ్ 40000బ్యాంక్ లొకేషన్, సైజును బట్టి ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు ఇవే..సైజ్మెట్రో ప్లస్మెట్రోఅర్బన్సెమీ అర్బన్రూరల్ఎక్స్‌ట్రా స్మాల్ రూ. 4000రూ. 3300రూ. 2200రూ. 2200రూ. 1000స్మాల్రూ. 75005000400030002000మీడియం1250010000750050004000ఎక్స్‌ట్రా మీడియం 1500012500800050004000లార్జ్20000150001000080006000ఎక్స్‌ట్రా లార్జ్4000020000150001000080002026 మార్చి 31 వరకు లాకర్ ఛార్జీలు ఇలా..సైజుమెట్రోఅర్బన్సెమీ అర్బన్రూరల్ఎక్స్‌ట్రా స్మాల్ రూ. 1350రూ. 1100రూ. 1100రూ. 550స్మాల్220016501200850మీడియం 4000300015501250ఎక్స్‌ట్రా మీడియం 4400330017501500లార్జ్10000700040003300ఎక్స్‌ట్రా లార్జ్ 2000015000110009000మెట్రో లొకేషన్‌లో సైజును బట్టి పాత, కొత్త లాకర్ ఛార్జీలు, పెరిగిన శాతంసైజ్ 2026, మార్చి 31 వరకు ఛార్జీలుఏప్రిల్ 1 నుంచి ఛార్జీలుపెరిగిన ఛార్జీపెరిగిన ఛార్జీ (శాతంలో)ఎక్స్‌ట్రా స్మాల్ రూ. 1350రూ. 3300రూ. 1950144 శాతంస్మాల్ 220050002800127 శాతంమీడియం4000100006000150 శాతంఎక్స్‌ట్రా మీడియం 4400125008100184 శాతంలార్జ్1000015000500050 శాతంఎక్స్‌ట్రా లార్జ్ 200002000000