Mutual Fund NFO: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కొత్త కొత్త స్కీమ్స్ లాంచ్ చేస్తున్నాయి. లుగు , ఒక ఎస్ఎఫ్ఐ (SIF) సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోల్లోని ఖాళీలను పూరించి కస్టమర్లను ఆకర్షించేందుకు ఫండ్ హౌస్‌లు కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తున్నాయి. మరి ఈ వారం లాంచ్ అవుతోన్న 5 ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్ తేదీలు, కనీస పెట్టుబడి ఎంత అనే వివరాలు తెలుసుకుందాం. ఐసీఐసీఐ ప్రూ ఎన్ఎఫ్ఓఐసీఐసీఐ ప్రూడెన్షియల్ డైవెర్షిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ICICI Prudential Diversified Equity All Cap Active FoF) సబ్‌స్క్రిప్షన్ మార్చి 2, 2026 నుంచే మొదలవుతోంది. మార్చి 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరే అసెట్ సిల్వర్ ఈటీఎఫ్..మీరే అసెట్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Mirae Asset Silver ETF FoF) సబ్‌స్క్రిప్షన్ మార్చి 5, 2026 నుంచి మొదలవుతోంది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ మార్చి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించగా ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిప్పాన్ ఇండియా ఎంఎఫ్నిప్పాన్ ఇండియా క్రిసిల్ ఐబీఎక్స్ ఫిన్ సర్వీసెస్ 3-6 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్ (Nippon India CRISIL-IBX Fin Services 3-6 Months Debt Index Fund) లాంచ్ అయింది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ సైతం మార్చి 5, 2026 నుంచే మొదలవుతుండగా మార్చి 9వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000గా నిర్ణయించారు. వెల్త్ కంపెనీ స్మాల్ క్యాప్ ఫండ్ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ నుంచి ద వెల్త్ కంపెనీ స్మాల్ క్యాప్ ఫండ్ (The Wealth Company Small Cap Fund) సబ్‌స్క్రిప్షన్ కోసం మార్చి 5వ తేదీన అందుబాటులోకి వస్తోంది. మార్చి 18వ తేదీ వరకు ఈ సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.10 వేలుగా నిర్ణయించారు. ఒక ఎస్ఎఫ్ఐ ఫండ్అరుధ ఈక్విటీ లాంగ్-షార్డ్ ఫండ్ (Arudha Equity Long-Short Fund) ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం మార్చి 5వ తేదీన అందుబాటులోకి వస్తోంది. మార్చి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.10 లక్షలుగా నిర్ణయించారు.