: భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే పన్ను శ్లాబుల్ని బట్టి టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా . కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే కట్టేది కూడా ఉంటుంది. ఇదే (ముందస్తు పన్ను). అసలు ఈ ముందస్తు పన్ను ఎవరు చెల్లించాలి.. ఎంత చెల్లించాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ డెడ్‌లైన్ మార్చి 15 గానే ఉంది. ఆలోపు టాక్స్ కట్టకుంటే భారీగా పెనాల్టీ, ఇతర చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అడ్వాన్స్ టాక్స్ అంటే ఏంటి?నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో మీరు సంపాదించిన ఆదాయంపై ముందుగానే చెల్లించే పన్నునే అడ్వాన్స్ టాక్స్ అంటారు. ఇక్కడ ఆర్థిక సంవత్సరం చివర్లో చెల్లించే బదులు.. ఐటీ శాఖ నిర్దేశించిన తేదీల్లోగా విడతల వారీగా దీనిని తక్కువ మొత్తాల్లో చెల్లిస్తూ పోవచ్చు. ఇక్కడ వ్యాపార వేత్తలు, వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, వృత్తి నిపుణులు వీరంతా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి రావచ్చు. రాబోయే ఆదాయాన్ని ముందుగానే అంచనా వేసి చెల్లించే పన్నునే అడ్వాన్స్ టాక్స్ అంటారు. ఇక్కడ అంచనా వేసిన ఆదాయంపై మీరు చెల్లించాల్సిన పన్ను రూ. 10 వేలు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వారంతా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఉద్యోగులకు యజమానులు.. వేతనం నుంచి మూలం వద్ద పన్నును డిడక్ట్ చేస్తాయి కాబట్టి వీరికి అడ్వాన్స్ టాక్స్ అవసరం లేదు. అదే జీతం కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉన్నట్లయితే ఇక్కడ కూడా నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అడ్వాన్స్ టాక్స్ ఎలా లెక్కించాలి?ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీ అన్ని రకాల ఆదాయాల్ని ముందుగా అంచనా వేసుకోవాలి. అంచనా వేసిన మొత్తం నుంచి మీకు అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపుల్ని తీసేయాలి. అప్పుడు ఉన్న ఆదాయంపై పన్ను లెక్కించాలి. ఇది రూ. 10 వేలు దాటితే.. ఐటీ శాఖ నిర్దేశించిన తేదీల్లోపు విడతల వారీగా లేదా దశల వారీగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి వస్తుంది.గడువులు ఇవే..జూన్ 15- ఇక్కడ మొదటి విడతలో భాగంగా చెల్లించాల్సిన పన్నులో 15 శాతం చెల్లించాలి. సెప్టెంబర్ 15- ఇది రెండో విడత. ఇక్కడ 45 శాతం వరకు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.డిసెంబర్ 15- మొత్తం ఆదాయంపై మీరు చెల్లించాల్సిన పన్నులో 75 శాతం వరకు పన్ను పూర్తి చేయాలి. మార్చి 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన 100 శాతం పన్ను నుంచి.. ఇదివరకు కట్టిన అడ్వాన్స్ టాక్స్ తీసేసి మిగతాది కట్టేయాలి. అంటే ఈలోగా అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ పూర్తి చేయాలి.నిర్దేశిత గడువులోగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించకపోతే.. దీనిపై ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ విధిస్తుంది. సెక్షన్ 234C ప్రకారం.. గడువులోపు చెల్లించాల్సిన పన్నుపై ఒక శాతం వడ్డీ పెనాల్టీగా చెల్లించాలి.