పెట్టుబడికి రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్.. లక్షకు 2 లక్షలు.. 5 లక్షలకు 10 లక్షలు.. గ్యారెంటీ రిటర్న్స్

Wait 5 sec.

Post Office Small Savings Schemes: మీరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా.. రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ రావాలని అనుకుంటే మాత్రం లేదా కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలు (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ఎలాంటి రిస్క్ ఉండదు. చిన్న మొత్తాల్లోనూ డిపాజిట్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. నిర్దిష్ట కాల పరిమితికి కచ్చితమైన రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. ఇందులో దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలు ఉన్నాయి. ఇందులో ఒక స్కీమ్ అయిన కిసాన్ వికాస్ పత్ర గురించి తెలుసుకుందాం. ఇది మీరు పెట్టిన పెట్టుబడిని ప్రస్తుత 7.50 శాతం వడ్డీ రేటు ప్రకారం.. కచ్చితంగా 115 నెలల్లో రెట్టింపు చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తున్న క్రమంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఇవి ప్రముఖ బ్యాంకుల్లో చారిత్రక కనిష్ఠాలకు పడిపోయాయని కూడా చెప్పొచ్చు. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా కాస్త ఎక్కువ వడ్డీ రేట్లతో స్థిరంగా రిటర్న్స్ అందించేలా పోస్టాఫీస్ పథకాలు ఉన్నాయి. ఇందులో మహిళలు, ఆడపిల్లలు, ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్లు ఇలా అందరికీ అందుబాటులో వేర్వేరు స్కీమ్స్ ఉన్నాయి. విషయానికి వస్తే కేంద్రం 1988లో అన్నదాతల్లో దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌గా దీనిని లాంఛ్ చేసింది. తొలుత రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. తర్వాత దీనిని అందరికీ విస్తరింపజేసింది. ఇక్కడ మార్కెట్‌తో సంబంధం ఉండదు. మీ పెట్టుబడిపై వడ్డీ రేటు ప్రకారం రాబడి ఉంటుంది. దేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ద్వారా ఈ పథకంలో చేరేందుకు వీలుంటుంది.కిసాన్ వికాస్ పత్ర హైలైట్స్..భారత పౌరులు 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ స్కీంలో చేరేందుకు అర్హులు. మైనర్ పేరిట తల్లిదండ్రులు లేదా గార్డియెన్స్ ఖాతా తెరవొచ్చు. ఒకరు ఎన్ని అకౌంట్లయినా తీసుకోవచ్చు.గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.కనీసం రూ. 1000 డిపాజిట్‌తో చేరొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. మీ స్థోమతకు తగ్గట్లుగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 7.50 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికానికి ఓసారి కేంద్రం సవరిస్తుంటుంది.ఈ లెక్కన ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా లెక్కల్ని బట్టి సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలల్లో అది రెట్టింపు అవుతుంది. అంటే అప్పుడే అకౌంట్ మెచ్యూర్ అవుతుందన్నమాట. ఇప్పుడు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే 115 నెలల్లో మీకు రూ. 2 లక్షలు వస్తాయి. 5 లక్షలు డిపాజిట్ చేస్తే అదే కాల వ్యవధిలో రూ. 10 లక్షలు వస్తాయి. 20 లక్షలు జమ చేస్తే 40 లక్షలు వస్తాయి. ఇక్కడ గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ వడ్డీ రేటు మారితే దానికి అనుగుణంగా కాల పరిమితి మారుతుందని తెలుసుకోవాలి. వడ్డీ రేటు పెరిగితే గనుక ఇంకా తక్కువ కాల వ్యవధికే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.