ఇరాన్ దెబ్బకు.. ఒక్కరోజే రూ.6.5 లక్షల కోట్లు లాస్.. 1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Wait 5 sec.

: ఇరాన్ యుద్ధం దెబ్బకు భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్ సూచీలను కుదిపేశాయి. దీంతో మార్చి 2వ తేదీ సోమవారం రోజు స్టాక్ మార్కెట్ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ 25 వేల మార్క్ కోల్పోయింది. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. యుద్ధ భయాలతో సోమవారం ట్రేడింగ్ మొదలు కాగానే సూచీలు కుదేలయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. క్రితం రోజు సెన్సెక్స్ 81,287.19 వద్ద ముగియగా ఈరోజు ఆరంభంలోనే ఏకంగా 2743 పాయింట్లు కోల్పోయి 78,543.73 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల నుంచి మాత్రం బయటపడలేకపోయాయి. మార్కెట్లు ముగిసే నాటికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 30 ఇండెక్స్ 1048.34 పాయింట్లు నష్టపోయింది. దీంతో 80,238.85 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడేలో 24,603 నుంచి 24,989 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 313 పాయింట్లు నష్టంతో 24,865.70 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ ఒక్కరోజులోనే రూ.6.50 లక్షలు తగ్గి రూ.457 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లకు ఒక్కరోజులోనే రూ.6.50 లక్షల నష్టం వాటిల్లింది. అత్యధికంగా నష్టపోయాయి. ఈ స్టాక్స్ 3-6 శాతం మేర నష్టపోయాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం మేర లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆటో సెక్టార్ టాప్ లూజర్‌గా మారింది. 2.2 శాతం మేర పడిపోయింది. అలాగే నిఫ్టీ కన్సూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సైతం 2 శాతం మేర పతనమైంది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అత్యధికంగా 6.36 శాతం మేర నష్టపోయింది. ఆ తర్వాత లార్సెన్ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ స్టాక్ 3.33 శాతం నష్టపోయింది. మారుతీ సుజుకీ స్టాక్ 3.16 శాతం పడిపోయింది.