Largest Selling Car in FY26: ఒకప్పటితో పోలిస్తే కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. సంపాదన పెరుగుతుందని కావచ్చు.. లేదా అందుబాటు ధరల్లో కార్లు ఉండటం కావచ్చు లేదా అవసరాలు పెరుగుతుండటం కావచ్చు.. విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. . గతేడాది సెప్టెంబర్- అక్టోబర్‌లో కేంద్రం చిన్న కార్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించి.. ఇంకా సెస్ తొలగించడంతో సేల్స్ అప్పటి నుంచి విపరీతంగా పెరిగాయి. ఇంకా అదనంగా ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించడం.. జనవరి- ఫిబ్రవరిలోనూ స్పెషల్ సేల్ కారణంగా కొనుగోళ్లు ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూస్తే (2025-26) ఇప్పటివరకు టాప్- 10 సెల్లింగ్ కార్ల గురించి చూద్దాం. మోడల్ ఏకంగా 2,07,906 యూనిట్ల విక్రయాలతో టాప్ ప్లేసులో నిలిచింది. >> 11 నెలల్లో మారుతీ డిజైర్ సేల్స్ 2.07 లక్షల యూనిట్లు దాటడం విశేషం. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే టాప్ ప్లేసులో నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌యూవీ రేసులో ముందున్న టాటా నెక్సాన్ ఎస్‌యూవీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న కార్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ 11 నెలల వ్యవధిలో టాటా నెక్సాన్ విక్రయాల సంఖ్య 1,96,244 యూనిట్లుగా ఉంది. డిజైర్ సేల్స్ సగటున నెలవారీగా 18,900 యూనిట్లుగా నమోదవుతుండగా.. ఇదే సమయంలో టాటా నెక్సాన్ విషయానికి వస్తే సగటు 17,840 యూనిట్లుగా ఉంది. SUV సెగ్మెంట్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. సెడాన్ సెగ్మెంట్‌కు చెందిన మారుతీ సుజుకీ డిజైర్ తొలి స్థానంలో నిలవడం విశేషం. . డిజైర్ ఎక్స్ షోరూం ధర సుమారు రూ. 6,25,600 నుంచి రూ. 9,31,300 మధ్య ఉంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం కూడా ఈ సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లలో మారుతీ సుజుకీ నుంచే ఆరు ఉండటం విశేషం. టాటాల నుంచి రెండు, మహీంద్రా, హ్యుందాయ్ నుంచి చెరొకటి ఉన్నాయి. వీటి సేల్స్ ఏప్రిల్- ఫిబ్రవరి మధ్య ఎలా ఉందో టేబుల్‌లో చూద్దాం. కారు మోడల్సేల్స్ (యూనిట్లు)మారుతీ సుజుకీ డిజైర్ సెడాన్ 2,07,906టాటా నెక్సాన్ SUV1,96,244హ్యుందాయ్ క్రెటా SUV1,84,083మారుతీ సుజుకీ ఎర్టిగా MPV1,81,804మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్1,70,804మహీంద్రా స్కార్పియో SUV1,64,222మారుతీ సుజుకీ బ్రెజ్జా SUV 1,63,974మారుతీ సుజుకీ వ్యాగన్R హ్యాచ్‌బ్యాక్1,63,109టాటా పంచ్ SUV1,63,003మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ SUV 1,56,823