ఆర్సీబీ అభిమానులు ఎగిరి గంతేసే వార్త.. చిన్నస్వామిలో చెడుగుడే..!

Wait 5 sec.

ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ 2026లో హోం గ్రౌండ్.. కర్ణాటకలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ.. ఐదు లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రం రాయ్‌పూర్‌లో జరుగుతాయి. ఈ విషయాన్ని ఆర్సీబీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టును ఆర్సీబీ పెట్టింది.దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. ఎందుకంటే ఆర్సీబీ.. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత సీజన్‌లో అంటే ఐపీఎల్ 2025లో విజేతగా నిలిచింది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిని క్షణాన్ని ఆర్సీబీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఫైనల్ మ్యాచ్ తర్వాత.. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ విజయాత్ర చేపట్టాలని భావించింది. తమ సొంత రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరులో ర్యాలీ చేపట్టి, ఆపై చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లు ఘనంగా సత్కరించాలని ప్లాన్ చేసింది.కానీ సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ టైటిల్ సాధించడంతో.. కోహ్లీ చేతిలో కప్పును చూసేందుకు అభిమానులు బెంగళూరుకు తరలివచ్చారు. దీంతో బెంగళూరుతో పాటు.. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఊహించనంత మంది అభిమానులు ఒక్కసారిగా రావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా విజయయాత్ర కాస్తా.. విషాదంగా మారింది.ఈ పరిణామం తర్వాత కర్ణాటక ప్రభుత్వం.. ఆర్సీబీపై కఠిన చర్యలు తీసుకుంది. ఫలితంగా ఐపీఎల్ 2026లో ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించనే ప్రచారం జరిగింది. దీంతో ఇతర నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని ఆర్సీబీ సైతం డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్, కర్ణాటక ప్రభుత్వం చొరవతో.. మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం రెండు మ్యాచ్‌లు మాత్రం రాయ్‌పూర్‌లో.. ఆర్సీబీ ఆడనున్నట్లు తెలుస్తోంది! మార్చి చివర్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.