Oil Reserves: ఇరాన్ పై ఇజ్రాయెల్ సాయంతో అమెరికా దాడులు చేసింది. ఇరాన్ సైతం అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై మిసైళ్లతో విరుచుకుపడింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దాదాపు 700 ట్యాకర్లు హార్ముజ్ మార్గంలోనే నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న భయాలు నెలకొన్నాయి. అయితే ప్రపంచంలోనే స్పందన ఇరాన్ పై దాడితో ఎందుకు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి? ఎన్ని రోజులకు వస్తాయి? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిందేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వరకు హార్ముజ్ జల సంధి నుంచే జరుగుతోంది. అలాగే భారత్‌కు దిగుమతి అయ్యే చమురులో 35-50 శాతం వరకు ఈ మార్గం ద్వారానే వస్తోంది. ఈ మార్గాన్ని మూసివేయడంతో చమురు రవాణా నౌకలు అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇరాన్ పై దాడి జరిగిన క్రమంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 83 డాలర్లు దాటింది. ఇరాన్ ఉద్రిక్తతలకు ముందు ఇది 70 డాలర్ల లోపే ఉండేది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?. అయినప్పిటకీ మన దేశంలో చమురు నిల్వలకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏదీ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో వాడుకునేందుకు భూగర్భంలో భారీ చమురు నిల్వలను ఏర్పాటు చేసుకుంది. విశాఖపట్నం, మంగళూరు, పడూరులో ఉన్న ఈ నిల్వలు 9.5 రోజుల వరకు సరిపోతాయి. అలాగే ఒడిశాలోని చండిఖోల్, రాజస్థాన్ లోని బికనేర్ వంటి మరో రెండు ప్రాంతాల్లో నిల్వ కేంద్రాలని భారత్ సిద్ధం చేస్తోంది. ఇక ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద ఉన్న నిల్వలు మరో 64-70 రోజుల వరకు వస్తాయి. దీంతో మొత్తంగా 74 నుంచి 80 రోజుల వరకు సరిపడా ఇంధన రక్షణ భారత్‌కు ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే పెరిగే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా తక్కువ ధరలు ఉన్నా దేశంలో చమురు ధరలను కంపెనీలు తగ్గించలేదు. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఆ సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ మార్జిన్లను పెంచుకున్నాయి. ప్రస్తుతం 10 శాతం ధరలు పెరిగినా చమురు ధరలను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆయిల్ దిగుమతుల కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.