Latest Gold Silver Rates: పసిడి ప్రియులకు మళ్లీ స్వల్ప ఊరట కలిగింది. నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్ కూడా దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇంకా ఇరాన్ పలు గల్ఫ్ దేశాలపైనా మిసైల్స్ ప్రయోగిస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల సమయంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి అటు ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీంతో అటు పెట్టుబడులు పెరిగి ధర పెరుగుతుంటుంది. గత 2 రోజులుగా అదే జరిగినా ఇప్పుడు మార్చి 3న పసిడి, వెండి ధరలు దిగొచ్చాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో తులం బంగారం ధర రూ. 2 వేలకుపైగా పడిపోగా.. వెండి రేటు రూ. 10 వేలు తగ్గింది. తగ్గిన గోల్డ్ రేటు..హైదరాబాద్ నగరంలో చూస్తే బంగారం ధర కిందటి రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2350 తగ్గగా ప్రస్తుతం మార్చి 3న ఉదయం 7 గంటల సమయంలో తులం గోల్డ్ రేటు రూ. 1,56,300 వద్ద ఉంది. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లిళ్ల సమయంలో ధర తగ్గడం సానుకూలాంశం అని చెప్పొచ్చు. దీనికి ముందు వరుసగా రెండు రోజుల్లో రూ. 4000, రూ. 6550 మేర ధర పెరిగింది. సిల్వర్ రూ. 10 వేలు డౌన్..మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ ధర మార్చి 3న రూ. 2580 తగ్గుముఖం పట్టగా 10 గ్రాములకు చూస్తే ప్రస్తుతం రూ. 1,70,510 వద్ద ట్రేడవుతోంది. ఇది ముందు 2 రోజుల్లో రూ. 4380, రూ. 7140 చొప్పున పెరిగాయి. బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా తగ్గింది. తాజాగా రూ. 10 వేలు తగ్గగా కేజీకి హైదరాబాద్ మార్కెట్లో రూ. 3.15 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 5 వేలు, రూ. 25 వేల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ముందటి రోజుతో పోలిస్తే భారీగానే తగ్గింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధర విపరీతంగా పెరగడంతో 2 రోజులుా గోల్డ్ రేటు కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్సుకు (31.10 గ్రాములు) ఒక దశలో 5400 డాలర్ల మార్కును దాటగా మళ్లీ ఇప్పుడు మార్చి 3న ఉదయం తగ్గి 5,330 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ రేటు ఒక రకంగా మళ్లీ క్రాష్ అయింది. కిందటి రోజు సాయంత్రం 95 డాలర్ల స్థాయికి చేరగా.. అక్కడి నుంచి భారీగా తగ్గి 88 డాలర్లకు దిగొచ్చింది. దీనికి అనుగుణంగా దేశీయంగా మార్చి 3న ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ ధరల్లో మార్పు వస్తుందని చెప్పొచ్చు.