ఐపీఎల్ 2026లో హవా కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డామినేటింగ్ విక్టరీతో గ్రాండ్‌గా సీజన్‌ను ఆరంభించిన ఆర్సీబీ.. ఐదు మ్యాచ్‌ల వరకూ అదే జోష్‌లో ఉంది. ఒక్క రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మినహా మిగతా అన్నీ మ్యాచ్‌లలోనూ ఏకపక్ష విజయమే సాధించింది. గతేడాది హోం గ్రౌండ్‌లో ఇబ్బంది పడిన ఇప్పుడు అదే చిన్నస్వామి స్టేడియంలో విజయ విహారం చేస్తోంది. ఆర్సీబీతో పాటు కూడా నిలకడగా ఆడుతూ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అటు బౌలింగ్, ఇటు బౌలింగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే ఏంటో చూయించింది. లక్నోపై టాస్ గెలిచిన రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకుని, పంత్ సేనని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. ఆర్సీబీ తన పేస్, స్పిన్ అస్త్రాలతో లక్నో టాప్ ఆర్డర్‌ను పతనం చేసింది. తొలి నాలుగు ఓవర్లు భారీ స్కోర్ చేయకపోయినా నిలకడగా ఆడిన లక్నో ఆ తర్వాత నుంచి పెవిలియన్ క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఎయిడెన్ మార్కరమ్ 8 బంతుల్లో 12 పరుగులు చేయగా, నికోలస్ పూరన్ 1, అబ్దుల్ సమ్మద్ 0, కెప్టెన్ రిషభ్ పంత్ గాయపడి మళ్లీ క్రీజులోకి వచ్చినా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 40, బడోనీ 38, ముకుల్ చౌదరి 39 పరుగులు చేయడంతో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ నిదానంగా ఆడుతూ మ్యాచ్‌ని ముగించింది. అనారోగ్యంతో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి రావడమే కాకుండా 49 పరుగులు చేసి తన నిబద్ధతను చాటుకున్నాడు. పటిదార్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్ హిట్టింగ్ చేయడంతో 15.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది. ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, ఒకటి ఓడి 1.503 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 228 పరుగులతో టాప్ ప్లేస్‌లో నిలవగా ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 224, రజత్ పటిదార్ 222, ఇషాన్ కిషన్ 213, వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో టాప్ 5లో నిలిచారు.