: భారత్‌లోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తగ్గించుకుంది. సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి చివరి నాటికి 5,84,519 గా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో చూస్తే ఉద్యోగుల సంఖ్య రికార్డు స్థాయిలో 23,460 తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా టాటా బ్రాండ్ టీసీఎస్‌‌ను ఒక బెంచ్‌మార్క్‌గా చూస్తుంటారు. అలాంటి టీసీఎస్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కంపెనీలు ఇలాగే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. టీసీఎస్‌ మాత్రం కాస్త ఎక్కువ ప్రభావితమైంది. అయితే ఇప్పుడు టీసీఎస్ నుంచి లేఆఫ్స్ గురించి కీలక ప్రకటన వచ్చింది. కంపెనీ తన పునర్‌వ్యవస్థీకరణ దశ ముగిసిందని సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ (ప్రాంగణ నియామకాలు) విషయంలోనూ మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. లేఆఫ్స్ ఇప్పట్లో ఉండబోవని స్పష్టం చేసింది. ఇది సంస్థలో పనిచేసే ఉద్యోగులకు అలాగే ఫ్రెషర్లకు కాస్త ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. 'మేం ఇప్పటికే 25 వేలకుపైగా క్యాంపస్ ఆఫర్లను ఇచ్చాం. ఇంకా ఏడాదిలో 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలనే ప్రణాళికకు కట్టుబడి ఉన్నాం.' అని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ సుదీప్ కున్నుమ్మల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సుమారు 44 వేల మంది ట్రైనీలను నియమంచుకుందని.. చివరి త్రైమాసికంలోనూ (జనవరి- మార్చి) సుదీప్. ఇక నో లేఆఫ్స్..ఇదే సమయంలో టీసీఎస్ ఒక ప్రకటనలో లేఆఫ్స్ గురించి ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన లేఆఫ్స్ సైకిల్ (లేఆఫ్స్ ప్రక్రియ) ఇప్పుడు ముగిసిందని పేర్కొంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్‌లో సుమారు 2 శాతం వరకు ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు.. కఠినమైన బెంచ్ పాలసీల్ని అమలు చేయనున్నట్లు 2025లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఎక్కువగా మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులపై ప్రభావం చూపించింది. ఐటీ రంగంలో ఏఐ ప్రభావం గురించి కూడా మాట్లాడిన సుదీప్.. కృత్రిమ మేధ వృద్ధి చెందుతున్న కొద్దీ.. టెక్నాలజీ భాగస్వాములపై ఆధారపడాల్సిన అవసరాన్ని కూడా పెంచుతుందని నొక్కిచెప్పారు. ఏఐ ప్రయోజనాల్ని పూర్తి స్థాయిలో పొందాలంటే.. వ్యక్తులకైనా, సంస్థలకైనా టీసీఎస్ వంటి కంపెనీల అవసరం పడుతుందని చెప్పుకొచ్చారు. కొత్త తరం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. టీసీఎస్ క్యూ4 ఫలితాలు..ఇటీవల ఏప్రిల్ 9న టీసీఎస్.. ప్రకటించింది. ఇక్కడ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ. 13,718 కోట్లుగా నమోదైంది. ఆదాయం 9.6 శాతం పెరిగి రూ. 70,698 కోట్లకు చేరుకుంది. త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే నికర లాభం 19.4 శాతం, ఆదాయం 5.4 శాతం పెరిగాయి.