టీ20 డైనమైట్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒకప్పుడు పూరన్ క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు షేక్ అవ్వాల్సిందే. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలు, సిక్సర్ల మోత మోగాల్సిందే. ఓడిపోయే మ్యాచ్‌లను కూడా ఎన్నోసార్లు గెలిపించాడు. కానీ, ఈ సీజన్‌లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏడు బంతులు ఆడిన నికోలస్ పూరన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రిషభ్ పంత్ ఇంజ్యూరీ కావడంతో క్రీజులోకి వచ్చిన పూరన్ కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. ఏడు బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పూరన్ బ్యాటింగ్ చూసిన అభిమానులు ఎలా ఆడేవాడు, ఇలా అయ్యాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పూరన్ మొత్తం మీద కలిపి కూడా 50 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లలో 19 హైయెస్ట్‌తో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. కేకేఆర్‌పై 15 బంతులు ఆడి 13 పరుగులు, గుజరాత్ టైటాన్స్‌పై 21 బంతులు ఆడి 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరగా ఆర్సీబీపై 7 బంతుల్లో 1 పరుగు చేశాడు. నికోలస్ పూరన్‌ను 2026కు ముందు ఫ్రాంఛైజీ రూ. 21 కోట్ల ధరకు రిటైన్ చేసుకుంది. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వచ్చిన పూరన్.. నాలుగేళ్ల పాటు ఆ జట్టు కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. 2022లో 306, 2023లో 358, 2024లో 499 పరుగులు చేసి లక్నో వెన్నెముకగా మారాడు. 2025 సీజన్‌లో 87 హైయెస్ట్‌తో ఐదు హాఫ్ సెంచరీలతో 524 పరుగులు చేశాడు. దాంతో లక్నో రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ ఈ ఏడాది పూరన్ ఆ స్థాయి ప్రదర్శన చేయకపోవడంతో ఆ ప్రభావం జట్టు మీద కూడా పడింది.