"సిచ్యుయేషన్‌తో సంబంధం లేదు.. బౌలర్లను చెడుగుడు ఆడేస్తాం, అదే మా మైండ్‌సెట్": ఐపీఎల్ టీమ్స్‌కు జితేశ్ శర్మ డైరెక్ట్ వార్నింగ్

Wait 5 sec.

తమ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొదటి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకూ ఎక్కడా తడబడకుండా బౌండరీలు బాదుతూనే ఉంది. మాత్రమే కొంచెం నిదానంగా ఆడుతుండగా, మిగతా అందరూ హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ జట్టు వికెట్ కీపర్, స్టార్ హిట్టర్ కూడా మ్యాచ్ అనంతరం చెప్పేశాడు. "బౌలర్లను డామినేట్ చేయడమే, అదే మా మైండ్‌సెట్. సిచ్యుయేషన్‌తో సంబంధమే లేదు" అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. అవతలి బౌలర్ ఎవరూ, ఏంటీ అనేదేమీ ఉండదను. బంతి దొరికిందా బౌండరీకి పంపిద్దామనే మైండ్ సెట్‌తోనే ఆడుతుంటామని జితేశ్ శర్మ చాలా క్లారిటీగా చెప్పేశాడు. వికెట్లు పడ్డాయానో, టార్గెట్ తక్కువగా ఉందనో నిదానంగా ఆడే ప్రసక్తే లేదని కూడా జితేశ్ శర్మ మాటల్లో తెలిసిపోతోంది. ఈ సీజన్‌లో మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేయగా, రెండు సార్లు ఛేజింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన మూడు సార్లూ కూడా 200కు పైగానే స్కోర్ చేసింది. ఇక ఛేజింగ్‌లో అయితే మరింత వీరోచితంగా ఆడుతూ ఓవర్‌కి 10కి పైగా పరుగులు బాదేసింది. ఒక్క రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ మినహా మిగతా అన్నీ మ్యాచ్‌లలోనూ ఆర్సీబీదే డామినేషన్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 200కు పైగా టార్గెట్‌ను కేవలం 15.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. సీఎస్కేపై 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. రాజస్థాన్‌పై 20 ఓవర్లలో 201, ముంబై ఇండియన్స్‌పై 240 పరుగులు బాదింది. చివరగా లక్నోపై 147 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. దీని బట్టి చూస్తే జితేశ్ శర్మ చెప్పినదాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదని తెలిసిపోతోంది. ఐపీఎల్ 2026లో డామినేటింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి వెళ్లింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో ఉండగా, కెప్టెన్ రజత్ పటిదార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ, టివ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ డెత్ ఓవర్లలో బౌలర్లకు నరకం చూపిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.