: పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఇటీవల చర్చలు విఫలం కాగా.. ఇప్పుడు మళ్లీ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. తాజాగా ప్రకటించారు. ఇస్లామాబాద్ వెళ్లేందుకు తాము సుముఖంగానే ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఇరాన్ కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యుద్ధం ముగుస్తుందన్న అంచనాల నడుమ.. ఒక్కసారిగా క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. కిందటి రోజు ఒక దశలో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లపైన ఉండగా.. అది దాదాపు 12 శాతానికిపైగా పతనమై ఏప్రిల్ 15న ఉదయం ఒక దశలో 91 డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం కాస్త కోలుకొని మళ్లీ 93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది కూడా కిందటి రోజుతో పోలిస్తే దాదాపు 10 శాతం తక్కువ కావడం విశేషం. చాలా రోజుల తర్వాత మళ్లీ క్రూడాయిల్ ధరలు ఈ స్థాయిలో పతనం అయ్యాయని చెప్పొచ్చు. >> యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. యుద్ధానికి ముందు 70 డాలర్ల దిగువన ఉన్న ముడి చమురు ధర అంతకంతకూ పెరుగుతూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఒక దశలో ఇది మార్చిలో 120 డాలర్ల స్థాయికి కూడా పెరిగింది. తర్వాత యుద్ధం ముగింపుపై ఒకసారి ట్రంప్ సంకేతాలు ఇవ్వగా భారీగా దిగొచ్చి 90 డాలర్ల స్థాయికి చేరినా.. మళ్లీ 2 రోజుల్లోనే ఉద్రిక్తతలు పెరగ్గా 110 డాలర్లకు ఎగబాకింది. . ఇక ఇప్పుడు చర్చలు జరుగుతాయన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో మళ్లీ దిగొచ్చాయి. ఇటీవల ఇరాన్- అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదరగా ఈ గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. ఇక ఆ లోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా- ఇరాన్ కోరుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉన్నా.. ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకల్ని హార్ముజ్ దగ్గర అడ్డుకుంటోంది. క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగాయి. ఇంకా స్టాక్ మార్కెట్లు మాత్రం పుంజుకుంటున్నాయి.