ట్రంప్ శుభవార్త.. ఇన్వెస్టర్లకు నిమిషాల్లోనే రూ. 10 లక్షల కోట్లు లాభం.. ఇక అన్నీ మంచి రోజులేనా?

Wait 5 sec.

Indian April 15: ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత చర్చలు విఫలం కాగా.. ఏప్రిల్ 13న (సోమవారం) భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఆరోజున .. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 208 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఇక ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 15న (బుధవారం) సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగనుండగా.. యుద్ధం ముగింపుపై ఆశలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే క్రూడాయిల్ ధరలు కూడా భారీగా తగ్గగా.. ఇన్వెస్టర్ల దృష్టి స్టాక్ మార్కెట్లవైపు మళ్లింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఏప్రిల్ 15న ఉదయం సరిగ్గా 9.20 గంటలకు దాదాపు 1300 పాయింట్లు పెరిగి.. 78,130 మార్కుపైన ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు పుంజుకొని 24,240 మార్కు వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఈ స్థాయిలో పుంజుకోగా మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగింది. కిందటి రోజు ఇది రూ. 448.76 లక్షల కోట్లుగా ఉండగా.. ఇవాళ నిమిషాల వ్యవధిలోనే రూ. 10 లక్షల కోట్లు పెరిగి ప్రస్తుతం రూ. 459 లక్షల కోట్లకు చేరుకుంది. ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్.. మరిన్ని కఠిన ప్రకటనలు చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ఇరాన్‌ నుంచి వెళ్లే, వచ్చే నౌకల్ని అడ్డుకుంటున్నట్లు తెలిపారు. దీంతో భయాలు మళ్లీ చెలరేగాయి. అయితే ఇప్పుడు రెండో దశ చర్చల్ని కూడా ఇస్లామాబాద్‌లో మరో 2 రోజుల్లో ప్రారంభించనున్నట్లు ట్రంప్ ప్రకటించగా.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం కూడా వీలైనంత త్వరలోనే ముగుస్తుందన్న ఆశలు ఇన్వెస్టర్లలో చిగురించాయి. ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే.. క్రూడాయిల్ ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. . ఇది కూడా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల జోష్ నింపిందని చెబుతున్నారు. పలు హెవీ వెయిట్ స్టాక్స్ రాణిస్తున్నాయి. టీసీఎస్, ఇండిగో, ఎల్ఐసీ, ఐనాక్స్ ఇండియా, ఇన్ఫోసిస్ఎల్ అండ్ టీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, గ్రో షేర్లు 3 శాతానికిపైగా పెరగ్గా.. రిలయన్స్, ఎస్బీఐ, బీఎస్ఈ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి 2 శాతం వరకు దూసుకెళ్లాయి.