లో భాగంగా 23వ మ్యాచ్‌లో , లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అదే జోష్‌తో ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ మూడు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 3లో నిలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడి, రెండు గెలిచింది. దాంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఆర్సీబీ నాలుగు గెలిస్తే, లక్నో రెండింటిలో విజయం సాధించింది. ఆర్సీబీ ఓడిన రెండు మ్యాచ్‌లు కూడా చిన్నస్వామి స్టేడియంలోనే కావడంతో ఫ్యాన్స్‌ను ఆ విషయం టెన్షన్ పెడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కూడా లక్నో తమ విశ్వరూపం చూయిస్తుందా? అన్న అనుమానంలో అభిమానులు ఉన్నారు. మొదటి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. రెండు, మూడు మ్యాచ్‌లలో గెలిచింది. గుజరాత్‌పై వన్ సైడ్ ఓటమిపాలయింది. ఆర్సీబీ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌లో కూడా గెలుపు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ, లక్నో మాన్‌స్టర్ హిట్టర్లు ఫామ్‌లోకి వస్తే ఆర్సీబీ చేతులెత్తేయడం ఖాయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనాఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రశిక్ సలామ్, జాకబ్ డప్ఫీ/జోష్ హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అంచనాఎయిడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే / నోకియా, మొహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్ / మొహ్సిన్ ఖాన్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్.