AP Inter 1st 2nd Year Result 2026 LIVE Updates: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ ఇలా చెక్ చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి. ఉదయం 10.31 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలకానున్నాయి. ఇంటర్ విద్యార్థులు , వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 నుంచి ఈ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెడితే మెనూ వస్తుంది.. అందులో ఇంటర్ రిజల్ట్ సెలక్ట్ చేసుకుంటే ఫలితాలను పొందొచ్చు. మంత్రి లోకేష్ ఇంటర్ పరీక్ష ఫలితాలపై ప్రకటన చేశారు. విద్యార్థులు ఆయా వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్ల సర్వర్లపై భారం ఎక్కువగా ఉంటుందని.. విద్యార్థులు ఓపికతో వేచి ఉండాలని అధికారులు సూచించారు. విద్యాశాఖ ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ఈ మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు మార్కులను విడిగా ఇస్తారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఇంటర్‌లో ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల రోజులు పట్టింది.. మూల్యాంకనం కూడా కాస్త ఆలస్యం అయ్యింది. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్‌ 14తో పూర్తయ్యిందని చెబుతున్నారు. అయినా సరే అధికారులు ఇంటర్ రిజల్ట్‌ను వేగంగా అందించేందుకు కసరత్తు చేశారు. ఎట్టకేలకు అధికారులు అనుకున్న సమయానికన్నా ముందే ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌ 5.31 లక్షలు, సెకండియర్‌ 5.26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 13న విడుదలైన సంగతి తెలిసిందే.