అక్షయ తృతీయ వేళ ఓలా స్పెషల్ సేల్.. రూ.50 వేల వరకు బెనిఫిట్స్.. ఓలా సోనా వీకెడ్ ఆఫర్

Wait 5 sec.

Ola Scooter: అక్షయ తృతీయ సందర్భంగా దిగ్గజ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ కంపెనీ మొబిలిటీ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఓలా సోనా వీకెండ్ (Ola Sona Weekend) పేరుతో సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పెషల్ సేల్ ద్వారా తమ పోర్ట్ ఫోలియోలోని అన్ని వాహనాలపై రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. కొత్త వాహనాల కొనుగోలుపై రూ. 40 వేల వరకు ప్రయోజనాలతో పాటుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్కాపియా ఫెడరల్, ఐబీఎఫ్‌సీ, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డులు వాడుతున్న యూజర్లకు రూ. 10 వేల అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఇస్తున్నట్లు ఓలా కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్లు, శని, అదివారం మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. అంటే ఈ అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన వారికే ఈ స్పెషల్ సేల్ వర్తిస్తుంది. ఆఫర్లు ఇవేవాట్ హవర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల ప్రారంభ ధర రూ. 49,999 గా కంపెనీ ప్రకటించింది.రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ హవర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ బైక్ పై ఏకంగా రూ. 50 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో ఈ వాహనం రూ. 1,39,999కే లభిస్తోంది. అలాగే ఈ ఆఫర్లలో కొనుగోలు చేసిన బైకులకు 8 ఏళ్ల పాటు బ్యాటరీ వారెంటీని అందిస్తామని ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు ఎలక్ట్రిక్ టూవీలర్లు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా ఉంటుందని, విజేతకు ఓలా సోనా స్పెషల్ ఎడిషన్ బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. 4680 భారత్ సెల్ తో రూపొందించిన రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ హవర్ బ్యాటరీ గల బైక్ కొనుగోలు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ గత కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మార్కెట్ వాటాను భారీగా కోల్పోయింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీవలో రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్ ధరను రూ. 60 వేల వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక తమ కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సర్వీసు కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత నెల నుంచి ఓలా సేల్స్ పెరుగుతుండడం గమనార్హం.