రోజా కుమార్తెకు అమెరికా యూనివర్సిటీ ప్రతిష్టాత్మక పురస్కారం.. కల నిజమైందంటూ ఎమోషనల్ పోస్టు

Wait 5 sec.

కల నిజమైంది అంటూ.. మాజీ మంత్రి రోజా తన కుమార్తె సాధించిన విజయం గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె అన్షు మాలిక అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు (2026)ను అందుకొని చరిత్ర సృష్టించిందని రోజా తెలిపారు. విద్యారంగంలో చూపిన అసాధారణ ప్రతిభకు గానూ అన్షు మాలికకు ఈ అవార్డు లభించింది. ‘ఓ చిన్న కలగా ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఇప్పుడు మాకెంతో గర్వకారణంగా.. మరెంత మందికో స్ఫూర్తిదాయకంగా మారింది. కష్టపడేతత్వం, అంకితభావం, ధైర్యం నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే.. నిన్ను చూస్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది’ అంటూ తమ గారాలపట్టి అన్షు మాలిక గురించి వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‍‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది.. కానీ చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉన్న ఆమె.. ప్రస్తుతానికి చదువు పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టారు. ఇండియానాలోని లూడీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో.. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఒక గొప్ప సైంటిస్ట్ కావాలనేది అన్షు లక్ష్యమని రోజా చాలా సందర్భాల్లో చెప్పారు. తన కుమార్తె గతంలో రోజా చెప్పారు. చదువుతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే అన్షు.. ఏడేళ్ల వయసు నుంచే కోడింగ్ కూడా నేర్చుకున్నారు. ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు.హెర్మన్ బీ వెల్స్ అనేది ఇండియానా యూనివర్సిటీ అందించే అత్యున్నత స్థాయి గౌరవ పురస్కారం. ఇండియానా యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ అయిన హెర్మన్ బీ వెల్స్.. ఈ వర్సిటీని ఓ ప్రధాన విద్యా సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన గౌరవార్థం ఈ అవార్డును అందిస్తారు. విద్య, ప్రజాసేవ, ఆర్ట్స్ అండ్ కల్చర్, సైన్స్ లేదా నాయకత్వం రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. విద్య, మేధోపరమైన సర్కిళ్లలో ఈ అవార్డును ప్రతిష్టాత్మకమైందిగా పరిగణిస్తారు.