, ఆ తర్వాత కాస్త నెమ్మదించాడు.. ఇప్పుడు ఏకంగా గాయపడ్డాడు., ఒక మ్యాచ్‌కి కూడా దూరంగా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కి రోహిత్ దూరమవ్వగా.. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముఖ్యంగా ముంబై ఓపెనింగ్ లెఫ్ట్, రైట్ కాంబినేషన్‌కీ ఇబ్బందే. దాంతో గుజరాత్‌పై మ్యాచ్‌కి హిట్‌మ్యాన్ రీ ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెట్స్‌లో గంటల తరబడి షాట్స్ కొట్టడంతో గుజరాత్‌పై ఆడే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. అయితే, హిట్ మ్యాన్ మ్యాచ్‌లో ఆడేది, లేనిది మెడికల్ టీమ్‌పైనే ఆధారపడి ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో గాయపడిన తర్వాత రోహిత్ శర్మ మెడికల్ టీమ్ అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి బాగానే ఉన్నా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే బరిలోకి దించాలని హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆలోచిస్తున్నాడు. దాని కోసం రోహిత్ శర్మ ప్రత్యేక డ్రిల్ కూడా నిర్వహిస్తున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన క్వింటన్ డికాక్ పంజాబ్‌పై సెంచరీ బాదినా, మ్యాచ్ ఓడిపోవడంతో పెద్దగా లైమ్ లైట్‌లోకి రాలేకపోయాడు. ఒకవేళ రోహిత్ శర్మ జట్టులోకి వస్తే ర్యాన్ రికెల్టన్‌కి రెస్ట్ ఇచ్చి, ఆ స్థానంలో డికాక్‌నే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే, అందులోనూ వికెట్ కీపర్లే కావడంతో ఇద్దరిలో ఒకర్నీ ఆడించి, మరొకరికి రెస్ట్ ఇస్తారు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నాలుగు మ్యాచ్‌లలో ఆడాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 38 బంతుల్లో 78 బాది సత్తా చాటగా, ఢిల్లీతో జరిగిన రెండో మ్యాచ్‌లో 26 బంతుల్లో 35 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. రాజస్థాన్‌పై 5, ఆర్సీబీపై 19 పరుగులే చేసి పెద్దగా రాణించలేకపోయాడు. ప్రస్తుతానికి ఫుల్ ఫిట్‌నెస్ సాధించనట్టు కనిపిస్తున్న రోహిత్ శర్మ రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.