: మనలో చాలా మందికి పెట్టాలని ఉంటుంది. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటారు. అయితే ఇప్పుడు మనం ఈ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా కొన్నింట్లో పెట్టుబడులు పెడితే పన్ను ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS) మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) గురించి చూద్దాం. ఒక్కోటి ఒక్కో రకమైన బెనిఫిట్స్ అందిస్తుంటాయి. అర్హతలు, లాకిన్ పీరియడ్స్ వేర్వేరుగా ఉంటాయి. వీటిల్లో ప్రతి దాంట్లో నెలకు రూ. 5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. 15 సంవత్సరాల్లో ఎంతొస్తుంది అనేది తెలుసుకుందాం.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పీపీఎఫ్ అనేది ఇది లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్. కాల పరిమితి 15 ఏళ్లుగా ఉంటుంది. ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. చాలా చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడులు ప్రారంభించొచ్చు. . సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ ఉండదు. ఏడాదిలో డిపాజిట్‌ను ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్లలో కట్టొచ్చు. ఇక్కడ లోన్ సదుపాయం కూడా ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు కూడా. ప్రస్తుతం ఇందులో వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. నెలకు రూ. 5 వేల చొప్పున లేదా సంవత్సరానికి రూ. 60 వేల చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో అంటే మెచ్యూరిటీకి రూ. 16.20 లక్షలు వస్తాయి. ఇక్కడ పెట్టుబడి రూ. 9 లక్షలే. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS): ఇది మ్యూచువల్ ఫండ్ రకం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిల్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. సెక్షన్ 80c కింద ఇక్కడ కూడా ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. సగటున వీటిల్లో వార్షిక ప్రాతిపదికన 12 శాతం రాబడి అంచనా వేస్తారు. ఇలా చూస్తే నెలకు రూ. 5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్లలో రూ. 9 లక్షల పెట్టుబడిపై మొత్తం రూ. 25.2 లక్షల వరకు అందుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS): ఇది . ఇక్కడ కూడా కాంట్రిబ్యూషన్లపై సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పరిమితి ఉంది. సెక్షన్ 80CCD (1B) కింద అదనంగా రూ. 50 వేల వరకు మినహాయింపునకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 60 ఏళ్ల వరకు ఫండ్స్ లాక్ అయి ఉంటాయి. కొన్ని నిబంధనలతో పాక్షిక విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడి, పన్ను ప్రయోజనాల కోసం ఈ స్కీంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం.. కార్పస్‌లో 80 శాతం వరకు మెచ్యూరిటీలో ఉపసంహరించుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ రిటర్న్స్ సాధారణంగా 9-12 శాతం వరకు ఉంటాయి. సగటున 10 శాతం రాబడి లెక్కన చూసినా.. ఇక్కడ నెలకు రూ. 5 వేల చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో రూ. 20-21 లక్షల వరకు ఆర్జించొచ్చు. గమనిక: పైన చెప్పింది కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడులకు సిఫార్సు కాదు. ఇక్కడ కొన్నింట్లో మార్కెట్ రిస్క్ ఉంటుంది. కాబట్టి.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.