మార్కెట్లలో ఒడుదొడుకులు.. అయినా భారీగా దూసుకెళ్లిన ఎస్బీఐ షేరు.. ఒక్కరోజే ఇంత శాతం పెరిగిందా?

Wait 5 sec.

Rally: స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం. చిన్న చిన్న అంశాలు కూడా స్టాక్ మార్కెట్లను భారీగా ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ ఒక్కసారిగా పెరగొచ్చు.. మళ్లీ అదే ఒక్కసారిగా తగ్గొచ్చు కూడా. కొంత కాలంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మార్చి నెలలో ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సూచీలు భారీ స్థాయిలో పడిపోయాయి. సెన్సెక్స్ ఒక్కటే 11 శాతానికిపైగా పడిపోగా.. ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. అయితే యుద్ధం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెలలో మాత్రం కాస్త పుంజుకున్నాయి. కిందటి వారం కూడా లాభాల్లోనే ముగిశాయి. ఇప్పుడు సోమవారం సెషన్‌లో (ఏప్రిల్ 20న) భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. బలపడింది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే సోమవారం రోజు ఆరంభంలో సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకుపైగా నష్టపోయినప్పటికీ.. తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో చూస్తే సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో 78,900 మార్కుపైన ట్రేడవుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 110 పాయింట్లు పుంజుకొని 24,465 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణిస్తున్నాయి. ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం దాదాపు ఒక శాతానికిపైగా పెరిగాయి. ఇక్కడ మనం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. సోమవారం రోజు ఇది భారీగా పుంజుకుంది. కిందటి రోజు (శుక్రవారం- ఏప్రిల్ 17) రూ. 1080.25 వద్ద ముగిసిన ఎస్బీఐ షేరు.. ఇవాళ దాదాపు అదే స్థాయిలో ఆరంభమైనా తర్వాత దూసుకెళ్లింది. ఆరంభంలో మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉన్నా ఇది రాణించింది. తర్వాత మార్కెట్ పుంజుకోగా.. షేర్ ధర మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో దాదాపు 4 శాతం వరకు పెరిగి రూ. 1120.95 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం రూ. 1117 వద్ద ఉంది. స్టాక్ భారీగా పెరగడంతో సంస్థ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ. 35 వేల కోట్ల మేర పెరగ్గా.. అదే స్థాయిలో ఇన్వెస్టర్ల సంపద పెరిగిందని చెప్పొచ్చు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1234.70 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 755.50 వద్ద ఉంది. సంస్థ మార్కెట్ విలువ రూ. 10.30 లక్షల కోట్లుగా ఉంది. ఒకవైపు నమోదు చేయగా.. ఎస్బీఐ కూడా రాణిస్తుందని ఇన్వెస్టర్లు భావించి కొనుగోళ్లు జరుపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది సమాచారమే.. పెట్టుబడులకు సిఫార్సు కాదు. వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.