తిరుమల: విజయ్ టీవీకే పార్టీకి ఓటేయాలని కొండపై ప్రచారం.. భక్తురాలి వీడియో వైరల్

Wait 5 sec.

పవిత్రతను పరిరక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ.. వలన వాటికి భంగం కలుగుతోంది. తాజాగా ఓ భక్తురాలు చేసిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విజయ్‍‌కు చెందిన టీవీకే పార్టీకి ఓటేయాలంటూ.. టీవీకే సింబల్ అయిన విజిల్ వేసి మరీ అభ్యర్థించింది. ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది నెట్టింట వైరల్ అవుతోంది. సదరు భక్తురాలు తమిళనాడుకు చెందిన మహిళగా తెలుస్తోంది. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ.. నాదనీరాజనం వద్ద భక్తురాలు ఎన్నికల ప్రచారం చేయటం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తిరుమల శ్రీవారి , రీల్స్ చేయటం వంటివి పూర్తిగా నిషిద్ధం. అయినప్పటికీ కొంతమంది భక్తులు అవగాహన లోపంతో, మరికొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తిరుమలలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితులలో మార్పులు రావటం లేదు. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని.. ఇలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, నెటిజన్లు కోరుతున్నారు.మరోవైపు గతేడాది కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది యువకులు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అన్నాడీఎంకే ఫ్లెక్సీని ప్రదర్శించటం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. గతేడాది డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. జయలలిత, పళనిస్వామి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కొంతమంది యువకులు ఆలయం దగ్గరలో ఫోటోలు, వీడియోలు తీసుకోవటంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినప్పటికీ అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.