హైదరాబాద్‌లో MMTS ఉచిత రైలు ప్రయాణం.. రేవంత్ సర్కార్ క్లారిటీ

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో వెలువడ్డాయి. అయితే దీనిపై సోషల్ మీడియా, కొన్ని మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కల్పించే అంశంపై దక్షిణ మధ్య రైల్వేతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. వీటికి సంబంధించి.. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ప్రభుత్వం అధికారిక వివరణ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ), పట్టణాభివృద్ధి శాఖ సంయుక్తంగా దక్షిణ మధ్య రైల్వేకు ఒక ప్రతిపాదనను పంపించినట్లు తెలిపింది. రాష్ట్ర సర్కార్ ఈ అధికారిక ప్రతిపాదనను రైల్వే శాఖకు లేఖ ద్వారా పంపించింది. ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన .. కొన్ని టెక్నికల్ అంశాలను ప్రస్తావించినట్లు పేర్కొంది. ఈ ఉచిత రైలు పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలతో కూడిన ఒప్పందాన్ని (ఎంఓయూ) సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఇక దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటే.. ఆ ప్రతిపాదనను ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రైళ్ల సంఖ్య.. రైలు వేళలు, స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు అన్నీ కూడా రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం కల్పించబడతాయని పేర్కొంది.అయితే ఈ ఉచిత రైలు ప్రయాణ అంశం ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని.. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దానిపై వివరణ ఇచ్చింది. ఉచిత ఎంఎంటీఎస్ రైలు ప్రయాణానికి సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ప్రయాణికులు గందరగోళానికి గురికావద్దని హితవు పలికింది. ప్రభుత్వం అధికారికంగా వెలువరించే ప్రకటనలను మాత్రమే నమ్మాలని పేర్కొంది. రైల్వే బోర్డు ఆమోదం.. ఒప్పంద ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే ఉచిత రైలు ప్రయాణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.