ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా నాయుడు పుట్టినరోజు సందర్భంగా గుంటూరుకు చెందిన భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ టీటీడీకి భారీ విరాళం అందించారు. తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు అయ్యే రూ.44 లక్షలను విరాళంగా అందజేశారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ ఏఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రకు విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారిని అభినందించారు. తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ముఖ్యమైనదన్నారు. భక్తుల సేవలో భాగంగా ఇలాంటి దాతృత్వం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైప మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సమయంలో కూడా భాష్యం విద్యాసంస్థల అధినేత ఇలాగే టీటీడీకి విరాళం అందించారు. జనవరి 23వ తేదీ నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే రూ.44 లక్షల రూపాయలను ఎస్వీ అన్నదాన ట్రస్టుకు అందించారు. అలాగేగా అందించారు. ఇక దేవాన్ష్ పుట్టినరోజు సమయంలోనూ చంద్రబాబు కుటుంబం ఇదే తరహాలో అన్నదానానికి రూ.44 లక్షలు విరాళంగా అందిస్తూ ఉంటుంది. మరోవైపు అందించారు. అయితే అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా ఆహారం అందించాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ల కోసం రూ. 76 లక్షలు విరాళంగా అందించారు. చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి 76 లక్షలు విరాళంగా అందించారు. ఈ నిధులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తారు. మరోవైపు చంద్రబాబు పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.