PBKS vs LSG: హోరాహోరీగా మ్యాచ్‌లో పోరాడి ఓడిన లక్నో.. పంజాబ్ ఘన విజయం!

Wait 5 sec.

హై టార్గెట్ ఛేజింగ్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠపోరు సాగింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో హైయెస్ట్ స్కోర్ నమోదు చేయగా.. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో లక్నో కూడా అదే రేంజ్ ప్రదర్శన చేసింది. పది ఓవర్ల తర్వాత వికెట్ల పడటం, స్కోర్ బోర్డు నెమ్మదించడంతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. హోం గ్రౌండ్‌లో పంజాబ్ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడారు. ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్‌లీ ఊచకోత బ్యాటింగ్ చేయగా.. ఆఖర్లో మార్కస్ స్టాయినీస్ రాణించడంతో పంజాబ్ కింగ్స్ 254/7 పరుగులు చేసింది. పంజాబ్ అందించిన భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా దీటుగా బదులిచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగం చేసిన లక్నో సక్సెస్ అయింది. ఆయుష్ బడోనీని ఓపెనర్‌గా దింపిన లక్నో పవర్ ప్లేలో 61 పరుగులు సాధించింది. బడోనీ 21 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 28 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసి అవుటయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ క్రీజులో ఉన్నంతసేపూ క్రేజీ షో చూయించాడు. 23 బంతులు ఆడిన పంత్ ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 43 పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్ మాత్రం మళ్లీ విఫలమయ్యాడు. హై టార్గెట్ మ్యాచ్‌లో కూడా షాట్స్ ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. కేవలం తొమ్మిది బంతులే ఆడిన పూరన్ తొమ్మిది పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్ ఫెయిల్యూర్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలి పది ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసుకున్న లక్నో.. ఆ తర్వాత పంజాబ్ బౌలింగ్ ధాటికి పరుగులు చేయలేకపోయింది. పంత్ అవుటవ్వడం, ఆ వెంటనే పూరన్ వికెట్ కోల్పోవడంతో పంజాబ్ ఓటమి ఖరారయింది. ఆఖర్లో ముకుల్ చౌదరి 21, ఎయిడెన్ మార్కరమ్ 42 పరుగులతో కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో పంజాబ్ ఆరు మ్యాచ్‌లలో ఆడి ఐదు మ్యాచ్‌లు గెలవగా, ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతున్న ఏకైక జట్టు పంజాబ్ కింగ్సే కావడం విశేషం.