పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదే.. తిరుమల వెళ్లినప్పుడే సమస్య తీవ్రత తెలిసిందా? ఆరోగ్యాన్ని అంత నిర్లక్ష్యం చేశారా!

Wait 5 sec.

జనసేన పార్టీ అధినేత, . శుక్రవారం నాడు అస్వస్థతకు గురికాగా వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. శనివారం ఆయనకు శస్త్రచికిత్స చేశారు. , ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌కు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి, సర్జరీ ఎందుకు చేశారని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ గురించి క్లారిటీ ఇచ్చారు.పవన్ కళ్యాణ్‌కు సైనసైటిస్ సర్జరీ చేశారు.. ముక్కుకు సంబంధించిన ఈ శస్త్రచికిత్స (ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ)ను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన కోలుకుంటున్నారు.. కాకపోతే వైద్యుల సూచన మేరకు, ఆయనకు కనీసం 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరం. భవిష్యత్తులో శ్వాస సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు ముఖ్యమైన సూచనలు చేశారు. అభిమానులు ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని దీర్ఘకాలికంగా సైనసైటిస్, పాలిప్స్ వంటి సమస్యలు ఉన్నవారికి చేస్తారు. సైనస్ సమస్య మందులతో తగ్గకపోతే డాక్టర్లు సర్జరీ చేస్తారు. ఎండోస్కోప్ ద్వారా ఈ సర్జరీని పూర్తి చేస్తారు. ఈ సర్జరీ ద్వారా సైనస్ మార్గాల్లో అడ్డుగా ఉండే పాలిప్స్, వాపు ఉన్నవాటిని తొలగిస్తారు. ఈ సర్జరీ తర్వాత వారం పాటూ జాగ్రత్తగా ఉండాలి.. ముక్కును ఊదకూడదు, బరువులు కూడా ఎత్తకూడదు. డాక్టర్ల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. 2018లో నడక మార్గంలో తిరుమల వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడ్డారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక 2024లోనూ అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లారు. ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఇతర సమస్యల కారణంగా మరో రోజు తిరుమలలోనే ఉండిపోయారు. ఈ రెండు సందర్భాల్లోనూ పవన్‌ కళ్యాణ్ పడిన ఇబ్బందిని చూసిన వారికి ఆయన ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం అర్థమైంది. తిరుమల నుంచి వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో పవన్ ఇబ్బందిపడ్డారు. 2026 ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన . పవన్ కళ్యాణ్ ఏటా చాతుర్మాస్య, వారాహి దీక్షలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల నుంచి చాతుర్మాస దీక్షను ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో చేస్తున్నారు. పవన్ ఈ దీక్షలో ఉన్నంత కాలం ఒక్కపూట మాత్రమే మితంగా సాత్వికాహారాన్ని స్వీకరిస్తారు. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటారు. దీక్షలు చేస్తుండటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం లాంటివి కూడా ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సైనస్, ఆస్తమా, నడుం నొప్పి, తరచుగా జ్వరం బారిన పడటం వంటి సమస్యలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలని జనసైనికులు కోరుకుంటున్నారు.