జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఇకపై సమాచారం కోసం ఇతరులను అడగాల్సిన అవసరం కానీ, గమ్యం తెలియక తికమక పడాల్సిన పని కానీ ఉండదు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని () ఒక వినూత్న మార్పును తీసుకువచ్చింది. హైవే వెంబడి ఉన్న మైలు రాళ్లు, సైన్ బోర్డులు, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ రహదారికి సంబంధించిన పూర్తి సమాచారం తక్షణమే మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.సాధారణంగా పెట్రోల్ బంకులు లేదా అత్యవసర సేవల కోసం ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడుతుంటారు. అయితే, కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యలు లేదా మ్యాప్‌లో ఖచ్చితమైన సమాచారం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారికంగా ధ్రువీకరించిన సమాచారాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అందిస్తోంది. దీనివల్ల ప్రయాణికులకు కచ్చితమైన వివరాలు అందడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుంది. ఇప్పటికే తీర్చిదిద్ది ఈ స్కాన్ బోర్డులను ఏర్పాటు చేసారు. తెలంగాణలోని మరికొన్ని రహదారులను కూడా స్మార్ట్ హైవేలుగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్కాన్‌తో లభించే సేవలు ఇవే..ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రహదారికి సంబంధించి పూర్తి వివరాలు లభిస్తాయి. ప్రయాణ మార్గంలో ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి? అక్కడ చెల్లించాల్సిన ఫీజు ఎంత? టోల్ మేనేజర్ల కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. సమీపంలోని పెట్రోల్ బంకులు, టైర్ పంక్చర్ షాపులు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల లొకేషన్లు తెలుసుకోవచ్చు. హైవే పక్కన ఉన్న నాణ్యమైన హోటళ్లు, రెస్టారెంట్లు, బస చేసేందుకు అందుబాటులో ఉన్న వసతి గృహాల వివరాలు ఉంటాయి. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, వాహనం మొరాయించినప్పుడు సంప్రదించాల్సిన హైవే హెల్ప్‌లైన్ నంబర్లు, అంబులెన్స్ సేవలు, సమీప ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు తక్షణమే లభిస్తాయి. ఈ నూతన విధానం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సులభతరంగా మారుస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.