ఇక మర్యాదల్లేవ్.. ఆ డీల్‌కు ఒప్పుకోవాల్సిందే.. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

Wait 5 sec.

ఇరాన్ పోర్టులను అమెరికా సైన్యం దిగ్బంధనానికి ప్రతీకార చర్యగా.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నిర్బంధనం కొనసాగిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్‌లో చర్చలకు తమ ప్రతినిధులు బయలుదేరారని, గతంలో తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరించాల్సిదేనని ఆయన తేల్చిచెప్పారు. లేకుంటే ఇకపై మర్యాదగా మాట్లాడుకోవడాలు ఉండవని, ఇరాన్ కిల్లింగ్ మెషీన్ అంతానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అంతేకాదు, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను పూర్తిగా నాశనం చేస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ఇరాన్, అమెరికాల మధ్య పాకిస్థాన్ వేదికగా సోమవారం రెండో దశ చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.‘ చేసిన ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదు.. మా ప్రతినిధులు చర్చల కోసం రేపు సాయంత్రం ఇస్లామాబాద్ వెళ్తున్నారు.. ఇరాన్ ఇటీవల ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడం వింతగా ఉంది.. ఎందుకంటే మేము ఇప్పటికే దానిని దిగ్బంధించాం.. వారికి తెలియకుండానే మాకు సహాయం చేస్తున్నారు.. ఈ మార్గం మూసివేయడం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం ఉండదు. వాళ్లే రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతారు! నిజానికి, ఎప్పుడూ 'బలవంతులుగా' కనిపించాలనుకునే ఐఆర్‌జీసీ (IRGC) సౌజన్యంతో ప్రస్తుతం అనేక నౌకలు సరుకులు నింపుకోవడానికి అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కాకు బయలుదేరాయి’’ అని పేర్కొన్నాయి.‘‘మేము చాలా న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం.. వారు దానిని అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను.. ఎందుకంటే, ఒకవేళ వారు అంగీకరించకపోతే ఇరాన్‌లోని ప్రతి ఒక్క విద్యుత్ ప్లాంటును, ప్రతి ఒక్క వంతెనను అమెరికా నేలకూల్చుతుంది. ఇకపై మర్యాదగా ఉండను.. గత 47 ఏళ్లుగా ఇతర అధ్యక్షులు ఇరాన్‌కు చేసి ఉండాల్సిన పనిని చేయడం నాకు గౌరవంగా ఉంటుంది. ఇరాన్ కిల్లింగ్ మిషన్‌ అంతానికి ముగింపు పలికే సమయం వచ్చింది!’’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.తమ పోర్టులపై మూసివేసే ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ ప్రకటన నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. అమెరికాతో చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ తుది శాంతి ఒప్పందం ఇంకా చాలా దూరంలో ఉందని స్పీకర్ సంకేతాలు ఇచ్చారు. పాకిస్థాన్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నౌకలపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనుంది.