కేరళలో జనసేన పార్టీ విస్తరణ.. తొలి అడుగు పడింది

Wait 5 sec.

జనసేన పార్టీని దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నాలు చేస్తామన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. కేరళంలో జనసేన పార్టీని విస్తరిస్తున్నారు.. , పార్టీ ప్రధాన కార్యదర్శ తాళ్లూరి రామ్‌లు తిరువనంతపురంలో నేతలతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో కేరళంలో బలోపేతానికి చేపట్టబోయే చర్యలు, ఆలోచనలపై చర్చించారు. కేరళలో జనసేన పార్టీని విస్తరించాలని స్థానిక నాయకుల అభ్యర్థన, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలతో అడుగులు ముందుకు వేశామన్నారు నేతలు.తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్సీ నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌ సమక్షంలో, స్థానిక నాయకుల నేతృత్వంలో నేషనల్‌ లేబర్‌ పార్టీ, హిందుస్థాన్‌ అవమీ మోర్చా, ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌ పార్టీ, లోక్‌ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, కాంగ్రెస్‌ పార్టీల నుంచి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు, తాళ్లూరి రామ్‌ పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు.జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దకాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు, అభివృద్ది పనులను అనురిస్తూ ఇతర రాష్ట్రాలలో జనసేన పార్టీ విధానాలు అవలంబించి, తమ ప్రాంతాల్లో జనసేన పార్టీని విస్తరించుకోవాలని అనుకోవడం శుభ పరిణామం అన్నారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని.. రాజకీయంగా స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి, విధానాలు ఉంటాయన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశస్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటోందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్. దక్షిణ భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం.. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన ప్రయత్నాలు చేపడతామన్నారు.