మూడుసార్ల ఐపీఎల్ ఛాంపియన్.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక ట్రోఫీలు ఉన్న టీమ్ . అలాంటి . అరివీర భయంకర బ్యాటర్లంతా కేకేఆర్ వైపే ఉన్నారు.. కాస్ట్లీ ఆల్‌రౌండర్, కాకపోతే కాస్త బౌలింగ్ వీక్. ఒక్క విజయం కోసం ఏడు మ్యాచ్‌ల వరకూ ఆగాల్సి వచ్చింది. ఆల్‌మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేసిన ఒక్క చిన్న మేస్టేక్‌తో కోల్‌కతా ఫస్ట్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో గెలిచింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగినా ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోగా.. ఆవేశంతో గ్రీన్ అవుటయ్యాడు. ఆ తర్వాత మిడిలార్డర్ మరోసారి హ్యాండిచ్చింది. చివరగా ఆడిన బంతి గాల్లోకి గెలవడంతో, కేకేఆర్ ఓటమి ఖరారయింది అనుకున్నారు. కానీ, బర్గర్ చేసిన ఆ చిన్న మిస్టేక్ రాజస్థాన్‌ను ఓడించి కేకేఆర్‌ను గెలిపించింది. కేకేఆర్ బ్యాటింగ్ 11వ ఓవర్‌ మొదటి బంతికే డేంజరస్ రోవ్‌మన్ పావెల్‌ని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. జడ్డూ బంతిని ఓవర్ లాంగ్ ఆన్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించి ఫెరీరా చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ 10.1 ఓవర్లకే 70 పరుగులు చేసి ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. జడ్డూ వేసిన అదే ఓవర్ ఆఖరి బంతికి రింకూ సింగ్ మిస్ హిట్ అవడంతో బంతి కీపర్ వెనుక గాల్లోకి లేచింది. ఈజీ క్యాచ్ కావడంతో షార్ట్ థర్డ్ మ్యాచ్‌లో ఉన్న బర్గర్ పట్టేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ బంతి చేతిలో పడి కిందపడింది. ఆ సమయంలో రింకూ సింగ్ స్కోర్ కేవలం 8 పరుగులే. ఆ క్యాచ్ వదిలేయడమే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. క్యాచ్ వదిలేసే సమయానికి 9 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన రింకూ సింగ్ ఆ తర్వాత మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. రమణదీప్ సింగ్ అవుటైనా అనుకుల్ రాయ్‌తో కలిసి మ్యాచ్‌ని ముగించాడు. 34 బంతులు ఆడిన రింకూ సింగ్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, కేకేఆర్‌‌కు తొలి విజయాన్ని అందించాడు. అనుకుల్ రాయ్ కూడా 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.