Vivo Price Hike: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో తమ కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. వివో తన స్మార్ట్ ఫోన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మిడ్ రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ మోడళ్ల ధరలను రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.4 వేల వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 21వ తేదీ నుంచే అమలోకి వస్తాయని టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ సంబంధిత ధరల లిస్టును సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే, ధరల పంపుపై గల కారణాలను వివో వెల్లడించలేదు. పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల సరఫరాలో అంతరాయం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, మొబైల్ తయారీ విడిభాగాల ఖర్చు పెరగడం వంటివి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల శామ్ సంగ్ కూడా తన స్మార్ట్ ఫోన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. వివో టీ5ఎక్స్ స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్ల ధరను రూ.4 వేల వరకు పెంచుతున్నట్లు వివో తెలిపింది. 6జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.18,999 నుంచి రూ.22,999కు చేరుతుంది. ఇక 8జీబీ ప్లస్ 128 జీబీ ధర రూ.20,999 నుంచి రూ.24,999గా మారుతుంది. 8జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ.22,999 నుంచి రూ.26,999కు పెరుగుతుంది. వివో వీ70 ఎలైట్ స్మార్ట్ ఫోన్ ధరలను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పెంచారు. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.51,999 నుంచి రూ.55,999లకు పెరుగుతుంది. 12జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.56,999 నుంచి రూ.59,999లకు పెరుగుతుంది. ఇక వివో నీ70 స్మార్ట్ ఫోన్ ధర రూ.4 వేల వరకు పెరుగుతుందని తెలిపింది. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.45,999 నుంచి రూ.49,999కి చేరుతుంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ధర రూ.49,999 నుంచి రూ.53,999కు చేరుతుంది. వివో వై400 స్మార్ట్ ఫోన్ మోడల్స్ ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పెరుగుతుంది. 8జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.25,999 నుంచి రూ.28,999లకు చేరింది. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.27,999 నుంచి రూ.31,999ల కు చేరుతుంది. 8జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.24,999 నుంచి రూ.27,999లకు చేరుతుంది. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.27,999 నుంచి రూ.30,999 స్థాయికి చేరుతుంది. వివో వై31 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.1000 నుంచి రూ.3 వేల వరకు పెరుగుతుంది. 4జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.18,999 నుంచి రూ.19,999వరకు పెరుగుతుంది. 6జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.20,999 నుంచి రూ.23,999 వరకు పెరుగుతుంది.