పోస్టల్ శాఖకు రూ. 15 వేల కోట్లకుపైగా ఆదాయం.. మెయిల్స్, పార్శిళ్లకు ఏ మాత్రం తగ్గని డిమాండ్!

Wait 5 sec.

: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పోస్టల్ డిపార్ట్‌మెంట్ (తపాలా విభాగం) ఏళ్లుగా దేశవ్యాప్తంగా.. మెయిల్స్, పార్శిల్స్, పొదుపు పథకాలు, పోస్టల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. లక్షల్లో పోస్టాఫీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్‌వర్క్ కలిగి ఉంది. ఒకవైపు అంతా డిజిటల్‌గా మారుతున్నా.. బ్యాంకింగ్ సేవలు డిజిటల్‌గా మారుతున్నప్పటికీ.. తపాలా శాఖ సేవలకు ఇప్పటికీ డిమాండ్ విపరీతంగా ఉంది. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం భారీగా పెరిగింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి జోతిరాదిత్య సింధియా తెలిపారు. వార్షిక ఆదాయం రూ. 15,296 కోట్లుగా నమోదైందని తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 16 శాతం పెరిగిందన్నారు. కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం, సర్వీసుల్లో వృద్ధి సాధించడం వంటి వాటితో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు 2025-26 చారిత్రక సంవత్సరంగా అభివర్ణించారు సింధియా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,218 కోట్ల ఆదాయం ఉండేది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 23 సర్కిళ్లలో.. 8 తమ టార్గెట్‌లో 90 శాతం వరకు సాధించాయని చెప్పుకొచ్చారు. మిగతా 14 సర్కిల్స్ 80-90 శాతం వరకు లక్ష్యాల్ని చేరుకున్నాయని వివరించారు. ఒకటే సర్కిల్ టార్గెట్‌లో 80 శాతానికి లోపు పరిమితమైందని అన్నారు. భారత తపాలా శాఖ.. తన సేవల్ని మరింత సమర్థవంతంగా, వేగంగా అందించేందుకు.. ఇంకా ఆదాయాన్ని పెంచుకునేందుకు.. పోస్టల్ కార్యకలాపాల్ని 6 ప్రధాన విభాగాలుగా విభజించింది. వీటినే వర్టికల్స్ అని పేర్కొంటారు. ఈ 6 విభాగాలు.. మెయిల్స్ (ఉత్తరాలు, పత్రాలు, సాధారణ తపాలా సేవలు), పార్శిల్స్ (ప్యాకేజీలు, కొరియర్ సేవల్ని వేగంగా డెలివరీ చేయడం), అంతర్జాతీయ వ్యాపారం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సహా సిటిజెన్ సెంట్రిక్ సర్వీసులు (ఆధార్ నమోదు, పాస్ట్‌పోర్ట్ సేవలు, బిల్ పేమెంట్స్) ఉన్నాయి. పార్శిళ్ల విభాగంలో ఆదాయం రూ. 1133 కోట్లు వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 69 శాతం పెరిగింది. గుజరాత్, ఝార్ఖండ్, తెలంగాణలో వీటికి మంచి డిమాండ్ ఉందని సింధియా వెల్లడించారు. మెయిల్స్ విభాగానికి వస్తే.. రూ. 3,202 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడ 34 శాతం వృద్ధి కనిపించింది. ఈ సేవలకు సంబంధించి జమ్ముకశ్మీర్, అసోం, రాజస్థాన్‌లో డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ మెయిల్ కేటగిరీ.. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాల కారణంతో పలు సమస్యల్ని ఎదుర్కొంది. ఇక్కడ ఆదాయం రూ. 864 కోట్లుగా నమోదైంది. విభాగం అత్యధికంగా రూ. 7,756 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 13 శాతం పెరిగింది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం రూ. 1458 కోట్లుగా ఉంది. ఇది 25 శాతం పెరిగింది.