యాపిల్ సీఈఓ పదవికి టిమ్ కుక్ గుడ్‌బై.. 15 ఏళ్ల ప్రస్థానానికి తెర.. కొత్త బాస్ ఎవరంటే?

Wait 5 sec.

: ప్రపంచ టెక్ రంగంలోనే ఒక తిరుగులేని శక్తిగా.. అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎదిగిన యాపిల్‌లో ఒక శకం ముగియబోతోంది. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన కంపెనీగా ఉన్నటువంటి యాపిల్‌లో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం యాపిల్ సీఈఓగా ఉన్న టిమ్ కుక్ (56) తన పదవి నుంచి తప్పుకోనున్నారు. దీనికి సంబంధించి యాపిల్ స్వయంగా ప్రకటించింది. సంస్థకు ఆయన పూర్తిగా దూరం కాకుండా.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక టిమ్ కుక్ వారసుడిని కూడా యాపిల్ ప్రకటించింది. .. యాపిల్ సంస్థ కొత్త సీఈఓగా నియమితులయ్యారు. ఈయన 2026, సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు. జాన్ టెర్నస్ ప్రస్తుతం యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయన 2001లో యాపిల్ సంస్థలో చేరారు. బయటికి కనిపించే యాపిల్ ప్రొడక్ట్స్ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. కానీ ఆ ప్రొడక్ట్స్ రూపొందడంలో.. వాటిని మరింత మెరుగుపర్చడంలో తెరవెనుక నిశ్శబ్దంగా.. నిలకడగా.. తన పనిచేసిన జాన్ కృషి ఉంది. అందుకే.. ఆయన ప్రతిభను మెచ్చి ఇప్పుడు కంపెనీ అధినేత బాధ్యతలు అప్పగించింది. పర్సనల్ కంప్యూటర్లకు పోటీగా.. యాపిల్ మ్యాక్ కంప్యూటర్ సహా ఐపాడ్స్, ఎయిర్‌పాడ్స్ వంటి ప్రొడక్ట్స్‌ సేల్స్ భారీగా పెరిగేలా చేయడంలోనూ ఈయన కృషి ఉంది. తాజా నాయకత్వ మార్పుతో యాపిల్.. హార్డ్‌వేర్ సహా ఏఐ వైపు దృష్టి మళ్లించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిప్ దిగ్గజం.. టెక్నాలజీ, ఏఐ విభాగంలో ప్రత్యక్ష పోటీకి సిద్ధమవుతోంది. కొంత కాలం కిందటే.. మార్కెట్ విలువలో యాపిల్‌ను దాటేసింది ఎన్విడియా. ఇక యాపిల్ సీఈఓగా ఉన్న సంస్థ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ అనారోగ్యం కారణంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో అప్పటికప్పుడు 2011లో టిమ్ కుక్‌ను కొత్త బాస్‌గా నియమించగా.. సుదీర్ఘంగా 15 ఏళ్లు పదవిలో ఉన్నారు. ఈయన హయాంలో యాపిల్ షేర్ వాల్యూ.. ఏకంగా 20 రెట్ల వృద్ధి సాధించడం విశేషం. యాపిల్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ. 373 లక్షల కోట్లుగా ఉంది. 1990ల్లో పర్సనల్ కంప్యూటర్ విభాగంలో కాంపాక్ సంస్థ దూసుకెళ్తుండగా.. అప్పుడే దివాలా అంచున ఉన్న యాపిల్ సంస్థను గట్టెక్కించేందుకు.. కాంపాక్ నుంచి టిమ్ కుక్‌ను నియమించుకున్నారు జాబ్స్. తన అసాధారణ నాయకత్వంతో టిమ్ కుక్.. యాపిల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.