తెలంగాణలో కొత్తగా మరో బస్ స్టేషన్.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

Wait 5 sec.

తెలంగాణలో కొత్తగా రానుంది. సోమవారం ( ఏప్రిల్ 20) కాళేశ్వరంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.198 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అందులో భాగంగా.. రూ.3.71 కోట్ల ఆర్టీసీ మోడల్‌ బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు నదీతీరం వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరాభివృద్ధికి సీఎం భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం మేరకు పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే సందర్భంగా భక్తుల సౌకర్యార్థం.. కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.ఇక పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో సీఎం రేవంత్ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ సైట్‌ను చేరుకున్న సీఎం పునరుద్ధరణ చేపట్టడానికి సంబంధించి జరుగుతున్న జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌ పరీక్షలను పరిశీలించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు ఇతర సంస్థల సూచనల ప్రకారం మేడిగడ్డను పునరుద్ధరించడానికి చేపట్టాల్సిన పనులపై జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.బ్యారేజీ కుంగిన ప్రాంతంలో పరిస్థితులను నీటి పారుదల శాఖ అధికారులు సమగ్రంగా వివరించారు. పునరుద్ధరణకు నిర్వహిస్తున్న వివిధ పరీక్షల విధానాలను తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు అంశాలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా జీపీఆర్, శాంపిల్స్ సేకరణ పనులను పరిశీలించారు. పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో 520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్‍కు పంపనున్నారు. అక్కడ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం దెబ్బతిన్న బ్యారేజీకి సంబంధించి పూర్తి అవగాహన రానుంది.డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్‌కు సంబంధించి అధికారులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి అధికారులు వివరించారు. ఈ పరీక్షల ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావానికి సంబంధించి ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద సీలెంట్ పైల్స్‌కు సంబంధించి సమాంతర క్రాస్‌హోల్ సీస్మిక్‌ టెస్ట్ వివరాలను తెలిపారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి బ్యారేజీ వద్ద సాగుతున్న వివిధ పరీక్షలను పరిశీలించిన అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోపాలను సరిచేసి పునరుద్ధరించడంలో ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందని పునరుద్ధరణలో భాగస్వామ్యమయ్యే సంస్థలు, అధికారులు, నిపుణులు సమస్యను అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్టేనని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్షల ద్వారా సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అధికారులు పనులు మొదలు పెట్టాలని చెప్పారు. సేకరించిన శాంపిల్స్ ద్వారా వచ్చే ఫలితాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. NDSA మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని, ప్రతి విషయంలో వారి అనుమతి తీసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.