ముంబై కమ్ బ్యాక్.. గజగజా వణికిన గుజరాత్, 100కే ఆలౌట్!

Wait 5 sec.

మొత్తానికి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ముంబై, ఆ తర్వాత . కనీస పోరాటం కూడా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పంజాబ్ కింగ్స్‌తో ఓటమి తర్వాత ముంబై ఆటగాళ్ల ముఖాలలో నెత్తుటి చుక్క కూడా కనిపించలేదు. . కానీ.. గుజరాత్‌ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు ఓటమి కసి మొత్తం తీర్చుకున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలో గుజరాత్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కొత్త ఓపెనర్ దానిష్ రెండో ఓవర్‌లోనే అవుటవ్వగా, పంజాబ్‌పై సెంచరీ చేసిన క్వింటన్ డికాక్ కూడా నాలుగో ఓవర్‌లో అవుటయ్యాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ క్లీన్ బౌల్డ్ కావడంతో 6 ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. నమన్ ధీర్ కాసేపు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 32 బంతుల్లో 45 పరుగులు చేసి అవుటైన తర్వాత ఇన్నింగ్స్ ఇంకాస్త నెమ్మదించింది. అయితే ఆఖరి ఆరు ఓవర్లలో తిలక్ వర్మ బీభత్సం సృష్టించాడు. 45 బంతుల్లో సెంచరీ నమోదు చేయడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మొన్నటి వరకు పేలవ బౌలింగ్ ప్రదర్శనతో భారీగా పరుగులు సమర్పించుకున్న ముంబై ఇండియన్స్ గుజరాత్ మ్యాచ్‌తో కమ్ బ్యాక్ ఇచ్చింది. జస్ప్రీత్ బుమ్రా తొలి బంతికే సాయి సుదర్శన్‌ని అవుట్ చేశాడు. రెండో ఓవర్‌లో బట్లర్‌ని పాండ్యా ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ కూడా 5వ ఓవర్‌లోనే అవుటవ్వడంతో గుజరాత్ పతనం మొదలైంది. వాషింగ్టన్ సుందర్ 17 బంతుల్లో 26 పరుగులతో కాసేపు రాణించినా శాంట్నర్ స్పిన్‌కు చిక్కేశాడు. అదే ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ కూడా అవుటవ్వడంతో గుజరాత్ కథ కంచికి చేరింది. అశ్వని కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో లోయర్ ఆర్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. దాంతో గుజరాత్ 15.5 ఓవర్లలో కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లు తీయగా, ఘజనాఫర్, మిచెల్ శాంట్నర్ చెరి రెండు వికెట్లు తీశారు. బుమ్రా, హార్దిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.